వైసీపీ ఎమ్యెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆయన భార్య వాణి, ప్రియురాలు దివ్వెల మాధురి ఎపిసోడ్ మీడియా లో ఎంతగా హాట్ టాపిక్ అయ్యిందో అందరూ చూసారు. దువ్వాడ వాణి తన భర్త దువ్వాడ శ్రీనివాస్ ఆస్తులన్నీ దివ్వెల మధురికి ఇచ్చేశారంటూ రచ్చ రచ్చ చేసారు. ఫైనల్ గా దువ్వాడ తన భార్య వాణికి అన్యాయం చేసేసి తన కొత్త ఇంటిని దివ్వెల మాధురి దగ్గర అప్పు చేసిన కారణంగా రాసిచ్చేసినట్లుగా మీడియా ముందు బయటపెట్టేసాడు.
అప్పటినుంచి దువ్వాడ కు దివ్వెలకు ఇక అడ్డు అదుపు లేకుండా పోయింది. దువ్వాడ అయితే అరవయ్యేళ్ళ వయసులోనూ ఇంకా యూత్ లా చెలరేగిపోతున్నాడు. భార్యను వదిలేసి దివ్వెల మధురి తో కలిసి రీల్స్ అంటూ హడావిడి చేస్తున్నాడు. రీసెంట్ గా ఓ ఎలెక్ట్రిక్ బైక్ ప్రమోషన్స్ లో దువ్వాడ-దివ్వెల కలిసి రెచ్చిపోయి బైక్ డ్రైవ్ చేస్తూ దానిని ప్రమోట్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.
అంతేకాదు దువ్వాడ శ్రీనివాస్-దివ్వెల మాధురి ఇద్దరూ కలిసి తిరుమల వెళ్లారు. అది చూసిన నెటిజెన్స్ ఎక్కడ చూసినా దువ్వాడ-దివ్వెల కనిపిస్తున్నారంటూ వెటకారంగా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఓ బాధ్యతాయుతమైన పదవి లో ఉండి ఇలా బరి తెగించి తిరుగుతున్న ఎమ్యెల్సీకి వైసీపీ అడ్డుకట్ట వేయకపోవడం పై ఏపీ ప్రజలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.