గేమ్ ఛేంజర్ నుంచి ఈ మధ్యనే రిలీజ్ అయిన సెకండ్ సింగిల్ రా మచ్చ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. ఈ మధ్యన దేవర నుంచి వచ్చిన చుట్టమల్లే, దావూది సాంగ్ తర్వాత అంతగా వైరల్ అయిన పాట రా మచ్చ. అయితే రా మచ్చ సాంగ్ రీల్స్ పై యాంటీ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. ఇదంతా పెయిడ్ ప్రమోషన్స్ అంటూ వారు రా మచ్చ వ్యూస్ పై సెటైర్స్ వేస్తున్నారు.
గేమ్ ఛేంజర్ నుంచి వచ్చిన రా మచ్చ సాంగ్ అంతగా పాపులర్ అవడానికి మేకర్స్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సేర్స్ కు డబ్బుచ్చి రీల్స్ చేపిస్తున్నారు, అందులో బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్ కి ఆ రా మచ్చ సాంగ్ కి డబ్బు అందింది, అందుకే అతను ఆ సాంగ్ ను ప్రమోట్ చేస్తున్నాడనే రూమర్స్ రాగా.. దానిని మెహబూబ్ ఆధారాలతో సహా తిప్పికొట్టాడు.
ఇక నిన్న బిగ్ బాస్ సీజన్ 8 రీ లోడెడ్ ఈవెంట్ స్టేజ్ పై హోస్ట్ నాగార్జున గేమ్ ఛేంజర్ నుంచి రా మచ్చ సాంగ్ కు స్టెప్స్ వేశారు. అది చూసిన యాంటీ ఫ్యాన్స్ మరోసారి రెచ్చిపోయి.. ఆ పాటకు నాగార్జున బిగ్ బాస్ స్టేజ్ పై డాన్స్ చేసినందుకు గాను రెండు లక్షలు అందుకున్నారు, అందుకే నాగ్ రా మచ్చ పాటకు స్టెప్స్ వేశారంటూ వెటకారంగా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.