బిగ్ బాస్ సీజన్ 8 మొదలైనప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు ఫుల్ బోరింగ్ తో నడుస్తుంది హౌస్. 14 మంది సీజన్ ఓపెనింగ్ ఎపిసోడ్ లో అడుగుపెట్టగా.. అందులో ఐదువారాలకు ఆరుగురు ఎలిమినేట్ అయ్యారు. ఇంకా హౌస్ లో ఎనిమిదిమంది మాత్రమే ఉన్నారు. వారికి తోడుగా.. బిగ్ బాస్ కొత్త ఎత్తు వేసాడు, డబుల్ ఎంటర్టైన్మెంట్ అంటూ ఈ సీజన్ లో సరికొత్త ప్లాన్ చేసారు.
అందులో భాగమే బిగ్ బాస్ సీజన్ 8 లోకి ఐదో వారంలో ఏకంగా ఎనిమిదిమంది వైల్డ్ కార్డు ఎంట్రీస్ ని పంపించారు. అది కూడా గత సీజన్స్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని తీసుకొచ్చి ఈ సీజన్ హౌస్ కు వైల్డ్ కార్డు అంటూ హౌస్ లోకి పంపించారు. అందులో హరితేజ, టేస్టీ తేజ, మెహబాబ్, నయని పావని, అవినాష్, గంగవ్వ, రోహిణి, గౌతమ్ అంటూ ఏకంగా రీ లోడెడ్ ఎపిసోడ్ లో ఎనిమిది మంది వైల్డ్ కార్డు ఎంట్రీస్ ఇప్పించారు.
మరి ఆల్రెడీ ఆడిన వాళ్ళను తీసుకొచ్చి ఇపుడు ఐదు వారాల ఆటగాళ్లపై వదిలారు. వైల్డ్ కార్డు ఎంట్రీస్ స్పెషల్ క్లాన్స్, అలాగే హౌస్ క్లాన్ మధ్యలో చిచ్చు పెట్టేందుకు బిగ్ బాస్ రెడీ అయ్యాడు. మరి ఇప్పటివరకు బోరింగ్ మీదున్న హౌస్ ఇప్పటికైనా కొత్తగా మారుతుందా, లేదా అనేది జస్ట్ వెయిట్ అండ్ వాచ్.