బిగ్ బాస్ 8 హౌస్ లో నిఖిల్-పృథ్వీ లతో సోనియా చేసిన స్నేహం బుల్లితెర ప్రేక్షకులకు నచ్చలేదు. ఫ్రెండ్స్ అంటే ఎలా ఉండాలి.. ఆ హగ్గులేమిటి, ఆ ముద్దులేమిటి అంటూ సోనియా పై విపరీతమైన నెగిటివిటి స్ప్రెడ్ అవడంతో సోనియా నాలుగో వారంలో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి రావాల్సి వచ్చింది.
హౌస్ నుంచి బయట కాలు పెట్టగానే సోనియా పై హౌస్ బయట వచ్చిన నెగిటివిటి గురించి ఆమె ఫ్రెండ్స్ చెప్పగానే ముందు నాకు కాబోయే భర్త యశ్ ఏమన్నాడో చెప్పమని అడిగాను, యశ్ బానే ఉన్నాడు. బిగ్ బాస్ నుంచి బయటికొచ్చినప్పుడు నాపై స్ప్రెడ్ అయిన ట్రోల్స్ చూసి నేను గనక ఆత్మహత్య చేసుకుని ఉంటే బాద్యులెవరు. నేను తప్పు చెయ్యలేదు. కానీ తప్పు చేసినట్టుగా పోట్రె చేసి బిగ్ బాస్ చూపించాడు.
మా మధ్యన హగ్గులు, ముద్దులు అనేది మాకు మెమొరబుల్ మూమెంట్స్. కానీ తప్పు జరిగినట్టుగా ప్రొజెక్ట్ చెయ్యడంతో నాపై హౌస్ బయట నెగిటివిటి ఎక్కువైంది. కేవలం నా ఇమేజ్ ను బిగ్ బాస్ డ్యామేజ్ చేసింది. నేను ట్రోల్స్ చూసి సూసైడ్ చేసుకుంటే దానికి బిగ్ బాస్ కానీ, నాగార్జున కానీ బాధ్యత తీసుకుంటారా అంటూ సోనియా సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.