ఏదైనా ఒక సినిమా సక్సెస్ అయ్యింది అంటే.. అందరూ అది హీరోదే విజయం, హీరో వలనే సినిమా హిట్ అయ్యింది అంటూ హీరోలకు భారీగా గిఫ్ట్‌లు అవీ ఇస్తూ ఉంటారు. అదే సినిమా ప్లాప్ అయ్యింది అంటే అది హీరోయిన్ అన్ లక్కీ, హీరోయిన్ వలనే సినిమా పోయింది అంటూ అందరూ తిడతారు.
సినిమా హిట్ అయితే క్రెడిట్ అంతా హీరో ఖాతాలోనే వేస్తారు అంటూ మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. హిందీ యుధ్రా ప్రమోషన్స్‌లో భాగంగా మాళవిక మోహనన్ హీరోలపై ఈ రకమైన సంచలన కామెంట్స్ చేసింది. మాళవిక మోహనన్ మలయాళం నుంచి వచ్చి తమిళంలో పాతుకుపోయింది.
ఇప్పుడు తెలుగులో జెండా పాతేందుకు సిద్ధమైంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది రాజా సాబ్ తో టాలీవుడ్‌కి ఇంట్రడ్యూస్ అవుతుంది. అటు హిందీలో యుధ్రాతో బలమైన ముద్ర వేసిన మాళవిక మోహనన్ హీరోలపై, హిట్స్‌పై చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.