Advertisement
Google Ads BL

దసరాను మిస్ చేసుకున్న టాలీవుడ్


ఏ స్టార్ హీరో అయినా, లేదంటే దర్శకనిర్మాతలైన లాంగ్ వీకేండ్ లేదంటే ఫెస్టివల్ సీజన్స్‌ను.. దసరా, సంక్రాంతి హాలిడేస్‌కి తమ సినిమాలు విడుదల చేసుకునేందుకు మొగ్గు చూపుతారు. హాలిడేస్ అయితే కలెక్షన్స్ బాగా వస్తాయని వారి ఆశ. కానీ ఈ దసరా హాలిడేస్‌ను మాత్రం మన టాలీవుడ్ హీరోస్ మిస్ చేసుకున్నారు. 

Advertisement
CJ Advs

గత వారం దేవర విడుదలైంది. దేవర పాన్ ఇండియా ఫిలిం కాబట్టి దాని తర్వాత వారం ఎవరూ సినిమాలు రిలీజ్ చేసేందుకు సిద్ధమవ్వలేదు. శ్రీ విష్ణు శ్వాగ్‌తో ఈ వారం వచ్చాడు. ఆల్రెడీ దసరా సెలవలు మొదలైపోయాయి. ప్రేక్షకులకు ప్రస్తుతం దేవర తప్ప మరో ఆప్షన్ లేదు. వచ్చే వారం తమిళ సూపర్ స్టార్ వేట్టయాన్ అక్టోబర్ 10న విడుదల కాబోతుంది. 

ఆ తర్వాత సుధీర్ బాబు మా నాన్న సూపర్ హీరో, గోపీచంద్ విశ్వం లు విడుదలకు రెడీ అవుతున్నాయి. అప్పటికే దసరా హాలిడేస్ ఆల్మోస్ట్ పూర్తవుతాయి. కానీ ఈ దసరా హాలీడేస్‌ను పెద్ద హీరోలు, యంగ్ హీరోలంతా మిస్ చేసుకున్నారు. కేవలం ఎన్టీఆర్ దేవర మాత్రం ఈ దసరా సెలవలను క్యాష్ చేసుకోవడం ఖాయంగా కనబడుతుంది.

Tollywood Missed Dussehra Holidays:

One Devara Benefit With dussehra Holidays
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs