Advertisement
Google Ads BL

బాహుబలి2 అంత ఇంపాక్ట్ ఉంటుందా?


బాహుబలి దగ్గర నుంచి అందరూ సీక్వెల్స్ వెంట పడుతున్నారు. బాహుబలి 1 చిత్రం క్లైమాక్స్ చూశాక బాహుబలి 2 కోసం పాన్ ఇండియా ఆడియన్స్ ఎంతో అటెన్షన్‌తో వెయిట్ చేశారు. అందుకు బోలెడన్ని కారణాలున్నాయి. అన్నిటికన్నా ఎక్కువ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ప్రశ్న కోసం బాహుబలి 2 చూసేందుకు జనాలు ఎగబడ్డారు.

Advertisement
CJ Advs

ఆతర్వాత ఆ స్థాయిలో ప్రేక్షకులు సీక్వెల్స్ కోసం వెయిట్ చెయ్యడమే లేదు. సలార్ 1 తర్వాత సలార్ 2లో శౌర్యంగా పర్వ కోసం ప్రభాస్ కోసం ఆయన ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మిగతా ప్రేక్షకుల్లో ఎంత అంచనాలున్నాయో చెప్పడం కష్టం. అలాగే పుష్ప పార్ట్ 1 చక్కగా ముగిసింది. దానికి సీక్వెల్ పుష్ప 2 రాబోతుంది. కానీ అది సీక్వెల్‌గా ఎవ్వరికి కనిపించడం లేదు పుష్ప 1 హిట్ అయ్యింది, ఆ తర్వాత 2 లో ఏం చూపిస్తారో అనే క్యూరియాసిటీ తప్ప ఇంకేం లేదు. 

ఇక కల్కి 2 పై కూడా కొట్టేసుకునేంత క్రేజ్ అయితే లేదు. ఇప్పుడు దేవర రిలీజ్ అయ్యింది. దానికి పార్ట్ 2 ఉంటుంది అని ప్రకటించారు. బాహుబలి 1 తర్వాత బాహుబలి 2 పై ఉన్న ఇంపాక్ట్ దేవర 2 పై ఉందా, దేవర సీక్వెల్ కోసం జనాలను వెయిట్ చేయించే ఇంట్రెస్టింగ్ కథ దేవర2 లో ఉందా.. అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ తప్ప దేవర 2 కోసం ఎవరూ పెద్దగా ఆలోచన చెయ్యడం లేదు. 

అందరూ పార్ట్ 1, 2 అంటూ పార్ట్ 1లో సాగదీసే కథలతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతున్నారు.. పార్ట్ 2 కోసం కథను దాచేసుకుని అడ్డమైన సన్నివేశాలను మొదటి భాగంలో పెడుతున్నారు. దానితో లాగ్ సీన్స్, అవి చూసి ప్రేక్షకులకు చిరాకు. అది మొన్నొచ్చిన దేవరకు కూడా వర్తిస్తుంది. ఇకపోతే దేవర 2 కోసమై ఏ మేర అంచనాలు ఉన్నాయో అనేది చూడడానికి ఇంకో రెండు మూడు సంవత్సరాలు అయితే ఆగాల్సి ఉంటుంది.

Audience Not Interested on Movie Sequels:

No Sequel to Create Bahubali Impact in Tollywood
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs