Advertisement
Google Ads BL

పొలిటిషియన్స్‌కి నాగ్ వార్నింగ్


మంత్రి కొండా సురేఖ క్షమాపణ చెప్పినా వెనక్కి తగ్గను. ఆమెపై పరువు నష్టం దావాను ఉపసంహరించుకోను. రూ. 100 కోట్లకు మరో దావా వేస్తా. ఆమె సమంతకు క్షమాపణలు చెబితే సరిపోతుందా? మరి నా కుటుంబం సంగతేమిటి? అంటూ ప్రశ్నించారు కింగ్ అక్కినేని నాగార్జున. తాజాగా ఆయన ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా ఇండస్ట్రీలోని వారిపై ఇకపై రాజకీయ నాయకులు మాట్లాడాలంటే భయపడేలా.. ఇకపై ఈ విషయాన్ని తీసుకెళతానని తెలిపారు.

Advertisement
CJ Advs

ఈ మొత్తం విషయంలో తెలుగు చిత్ర పరిశ్రమ తనకు అండగా నిలబడిందని, అందుకు నాన్న అక్కినేని నాగేశ్వరరావుకి ఉన్న మంచితనంతో పాటు ఆయన ఆశీస్సులే కారణమని అన్నారు. ఎప్పుడూ బలమైన వ్యక్తినని అనుకుంటానని, కుటుంబ పరిరక్షణ విషయానికి వస్తే మాత్రం తానొక సింహాన్ని అని కింగ్ నాగ్ ఈ ఇంటర్వ్యూలో చెప్పారు. అదృష్టవశాత్తూ.. మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమ ఈ విషయంలో మద్దతు ఇచ్చినందుకు ఆయన థ్యాంక్స్ చెప్పారు.

ఎవరుపడితే వారు తమ రాజకీయ ప్రయోజనాల కోసం మా పేర్లను వాడుకుంటున్నారని, ముఖ్యంగా వినోద రంగంలో ఉన్న మమ్మల్ని చాలా తేలికగా భావిస్తూ.. లక్ష్యంగా పెట్టుకుంటున్నారని నాగ్ అన్నారు. కొండా సురేఖపై చట్టపరంగా మేం తీసుకునే చర్యలు.. ఇతర రాజకీయ నేతలకు ఒక హెచ్చరికగా ఉంటాయని.. ఇకపై మాలాంటి వారిపై వివాదస్పద వ్యాఖ్యలు చేయకుండా వారిని నిరోధిస్తాయని తాను భావిస్తున్నట్టు నాగార్జున ఈ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ విషయంలో తమకు సత్వర న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని నాగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

King Nagarjuna Warning To Political Leaders:

King Nagarjuna Latest Interview Highlights <div></div>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs