Advertisement
Google Ads BL

ఒకవైపు విమర్శలు మరోవైపు పూజలు


ప్రస్తుతం సమంత పై తెలంగాణ మినిస్టర్ కొండా సురేఖ చేసిన కామెంట్స్ హాట్ హాట్ గా చర్చలకు దారితియ్యడం అటుంచి సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ సమంత కు సపోర్ట్ గా నిలబడ్డారు. సమంత కూడా స్వయంగా తన విడాకులకు రాజకీయాలకు సంబంధం లేదు అంటూ ట్వీట్ పెట్టింది. దానితో కొండా సురేఖ సమంతకు సారీ చెప్పింది. 

Advertisement
CJ Advs

ప్రస్తుతం రాజకీయాల్లో, సినిమా ఇండస్ట్రీలో సమంత, అక్కినేని మేటర్ హాట్ హాట్ గా నడుస్తున్న సమయంలో సమంత మాత్రం అమ్మవారికి స్పెషల్ పూజలు చేసుకుంటుంది. విడాకుల తర్వాత ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయిన సమంత ప్రస్తుతం కోయంబత్తూరు లోని ఈషా ఫౌండేషన్ లో కనిపించింది. 

ఈషా ఫౌండేషన్ లో లింగ భైరవి ఆలయంలో దేవి నవరాత్రులు సందర్భంగా స్పెషల్ పూజలు నిర్వహించిన సమంత అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న ఫొటోస్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అది చూసిన నెటిజెన్స్ ఒకపక్క విమర్శలు, మరోపక్క పూజలా సమంత అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

Samantha can be seen praying at Isha Foundation:

Samantha can be seen praying at Isha Foundation Linga Bhairavi temple
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs