దేవర సినిమా విడుదలైన రోజు వచ్చిన నెగిటివిటి చూస్తే దేవర చిత్రం డిసాస్టర్ అవ్వడం పక్కా. రాజమౌళి సెంటిమెంట్ ను ఎన్టీఆర్ దాటలేకపోయాడు, కొరటాల శివ ఆచార్య తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొంప ముంచాడంటూ సోషల్ మీడియా మొత్తం దేవర పై పడిపోయింది. కానీ దేవర చిత్రానికి రెండోరోజు నుంచే అనూహ్యమైన పోజిటివిటి మొదలయ్యింది.
రోజు రోజుకు కలెక్షన్స్ పెరిగాయి. దేవర విడుదలకు ముందు అభిమానులతో కలిసి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహిద్దామని ప్లాన్ చేస్తే అది ఫెయిల్ అయ్యి ఈవెంట్ రద్దయ్యింది. దానితో ఈసారి ఓపెన్ గ్రౌండ్ దేవర సక్సెస్ ను అభిమానుల నడుమ జరుపుకోవాలని ఎన్టీఆర్ అండ్ టీమ్ రెడీ అయినప్పటికీ రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతి లభించలేదు. దానితో ఈవెంట్ క్యాన్సిల్ చెయ్యాల్సి వచ్చింది.
ఇక దేవర టీమ్ అలాగే దేవర డిస్ట్రిబ్యూటర్స్ కు నిర్మాత సుధాకర్ మిక్కిలినేని హైదరాబాద్ పార్క్ హయాత్ లో గ్రాండ్ గా పార్టీ ఇచ్చారు. ఆ పార్టీకి ఎన్టీఆర్ అలాగే అన్న కళ్యాణ్ రామ్, దిల్ రాజు, నాగవంశీ ఇంకా దేవర టీమ్ అంతా హాజరైంది. ఆ సక్సెస్ పార్టీలో ఎన్టీఆర్ మాట్లాడుతూ కొరటాల తో తన ప్రయాణం బృందావనం టైమ్ నుంచి మొదలైంది. ఇప్పుడు కొరటాల నా ఫ్యామిలీ మెంబెర్ గా మారారు.. మేమంతా దేవర 2 షూటింగ్ కోసం వెయిట్ చేస్తున్నామంటూ ఎన్టీఆర్ కొరటాలను పొగిడేసాడు.
అంతేకాదు అభిమానులను ఉద్దేశించి మట్లాడుతూ.. ఈ జన్మలో మీ కోసం ఏది చేసినా అది వడ్డి మత్రమే..వచ్చే జన్మలో మీ ఋణం తీర్చుకుంటాను అంటూ ఎన్టీఆర్ అభిమానులను కూడా కూల్ చేసేసాడు.
ఇక ఎన్టీఆర్ ఆర్ట్స్ అలా ఉండడానికి హరికృష్ణ కొసరాజు కారణం, అన్న కళ్యాణ్ రామ్, నా వెనుక హరికృష్ణ ఉన్నాడు అంటూ ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.