Advertisement
Google Ads BL

బిగ్ బాస్ నన్ను బ్యాడ్ చేసాడు: సోనియా


బిగ్ బాస్ లోకి వెళ్లే ముందు ఉన్న క్రేజ్.. బిగ్ బాస్ లోకి వెళ్ళాక ఇంకాస్తా పెరుగుతుంది అని చాలామంది నమ్మి హౌస్ లోకి అడుగుపెడతారు. హౌస్ లోకి వెళ్ళాక కొత్త స్నేహాలు, కొంతబంధాలతో కొంతమంది ఉన్న క్రేజ్ పోగొట్టుకుని నెటిజెన్స్ చేతిలో ట్రోల్ అవుతూ హౌస్ నుంచి బయటికొచ్చాక ఎవ్వరికి కనిపించకుండా పోతారు. అలా చాలా సీజన్స్ లో చాలామంది చేసారు. 

Advertisement
CJ Advs

ఇప్పడు ఈ సీజన్ లో సోనియా హౌస్ బయట విపరీతమైన నెగిటివిటి మూటగట్టుకుంది. హౌస్ లోపల నిఖిల్, పృథ్వీ లతో చేసిన స్నేహం, ఆమె ఆడిస్తే వాళ్ళు ఆడినట్టుగా ప్రొజెక్ట్ అవడం అన్ని సోనియా ను బ్యాడ్ చేసాయి. హౌస్లోనూ, బయట కూడా సోనియా పై వచ్చిన నెగిటివిటి, ట్రోల్స్ ఇప్పటివరకు ఏ కంటెస్టెంట్ మీద రాలేదు. ఫైనల్ గా నాలుగో వారం నామినేషన్స్ లోకి రాగానే సోనియాను ఇంటికి పంపేశారు ఆడియన్స్. 

తాజాగా ఆమె బిగ్ బాస్ విషయాలను మట్లాడుతూ బిగ్ బాస్ వలన నా ఇమేజ్ పెరుగుతుంది అనుకుంటే బిగ్ బాస్ నన్ను రోడ్డున పడేసాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. నేను హౌస్ లో విష్ణు ప్రియను టార్గెట్ చేశాను అని చూపించారు. కానీ విష్ణునే నన్ను టార్గెట్ చేసింది. నిఖిల్ డిప్రెషన్ లో ఉన్నాడు. అందుకే స్నేహం చేశాను, అడ్వైజ్ ఇచ్చాను. తాను నా ఫ్యామిలా భావించాను. 

నేను హౌస్ లో ఏ తప్పు చెయ్యలేదు. కానీ నా మాటలను ఇష్టం వచ్ఛినట్టుగా ఎడిట్ చేసి చూపించడం తప్పు. నేను బయట ఎవ్వరికైనా అడ్వైజ్ ఎలా ఇస్తానో, నిఖిల్, పృథ్వీలకు అలానే ఇచ్చాను, అది తీసుకోవడం, తీసుకోకపోవడం వాళ్ళిష్టం. గేమ్ లో నిఖిల్, పృథ్వీలను చూడకు నా గేమ్ చూడు అని యష్మి తో అన్నాను. కానీ అది తప్పుగా చూపించారు. నాగార్జున గారు కూడా సపోర్ట్ చెయ్యలేదు. 

అక్కడ నీ నిజాయితీ ఏమైపోయింది, అప్పుడే నాకు హౌస్ లో ఉండాలనిపించలేదు. నేను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాను, యష్ అనే అబ్బాయిని వివాహం చేసుకోబోతున్నాను, యష్ తండ్రి నేను హౌస్ లో ఉన్నప్పుడు నా కోసం క్యాంపైన్ చేసారు అంటూ సోనియా తన ఇమేజ్ బిగ్ బాస్ లో డ్యామేజ్ అయినట్లుగా చెప్పుకొచ్చింది.  

Bigg Boss made me bad: Sonia:

Bigg Boss Sonia Akula Sensational Comments On Bigg Boss
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs