Advertisement
Google Ads BL

ఏ పొలిటికల్ లీడర్ తో సంబంధం లేదు: రకుల్


ఒక్కప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో కనిపించి కొన్నేళ్ళయిపోయింది. ప్రెజెంట్ బాలీవుడ్ లోనే సినిమాలు చేసుకుంటున్న రకుల్ ప్రీత్ పేరు ఎక్కువగా పాలిటిక్స్ లో వినిపిస్తూ ఉంటుంది. కేటీఆర్-రకుల్ కి మధ్యన ఏదో సంబంధం ఉంది అంటూ సోషల్ మీడియాలో న్యూస్ తరచూ వినిపిస్తూ ఉంటుంది. 

Advertisement
CJ Advs

రీసెంట్ గా కొండా సురేఖ సమంత-నాగ చైతన్య డివోర్స్ విషయంలో చేసిన కామెంట్స్ పై సినిమా ఇండస్ట్రీ మొత్తం రియాక్ట్ అవడంతో రకుల్ కూడా సోషల్ మీడియా వేదికగా ఈ ఇష్యుపై రియాక్ట్ అవుతూ సమంత కు మద్దతుగా నిలిచింది. టాలీవుడ్ లో క్రియేటివిటికి, టాలెంట్‌కి, ఫ్రోఫెషనలిజంకు వరల్డ్ వైడ్ గా ఏంతో పేరుంది. ఇంత పేరున్న టాలీవుడ్ నేను వర్క్ చేసినందుకు సంతోషంగా వున్నాను. 

టాలీవుడ్ లో నాది ఎంతో అందమైన జర్నీ. నాకు టాలీవుడ్ తో గొప్ప అనుబంధం వుంది. 

ఈ రోజున ఇలాంటి నిరాధారమైన, దుర్మార్గమైన పుకార్లు నాతోటి నటీనటులపై పుట్టించడం నిజంగా బాధాకరం. అలాంటి అసభ్యకరమైన వ్యాఖ్యలను ఎంతో బాధ్యతాయుతమైన స్థానంలో వున్న మరో మహిళ చెయ్యడం సిగ్గుచేటు. నేను ఎప్పుడు రాజకీయాలకు సంబంధం లేని మనిషిని, ఏ రాజకీయ పార్టీతో కానీ పొలిటికల్‌ లీడర్‌తో నాకు సంబంధం లేదు. 

నా పేరును మీ రాజకీయాల కోసం వాడుకోవడం మానేయమని కోరుతున్నాను. దయచేసి సినిమా నటులను, సెన్సిటివ్‌ పర్సన్‌ను రాజకీయ రూమర్స్‌ కు దూరంగా వుంచండి. మా పేర్లకు ఇలాంటి రూమర్స్ కు జోడించి ప్రచారం చేయకండి.. అంటూ రకుల్ సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. 

Not related to any political leader: Rakul:

Rakul Preet slammed Telangana Minister Konda Surekha 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs