Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు సారీ చెప్పిన ప్రొడ్యూసర్


అవును ఎన్టీఆర్ అభిమానులకు నిర్మాత నాగవంశీ సారీ చెప్పాడు. కారణం దేవర సక్సెస్ సెలెబ్రేషన్స్ ను నిర్వహించలేకపోతున్నందుకు నాగ వంశి ఎన్టీఆర్ అభిమానులను క్షమాపణలు కోరుతున్నాడు. దేవర సక్సెస్ అయ్యినందుకు సక్సెస్ సెలెబ్రేషన్స్ నిర్వహించాలని మేకర్స్ సిద్ధమయ్యారు. గుంటూరు పెద కాకాని దగ్గరలో దేవర సక్సెస్ ఈవెంట్ ఉంటుంది అన్నారు. 

Advertisement
CJ Advs

అయితే తాజాగా అక్కడి ప్రభుత్వం నుంచి అనుమతి లభించనందు వలన దేవర ఈవెంట్ క్యాన్సిల్ చెయ్యాలని నిర్ణయించడంతో అభిమానులు డిజ్ పాయింట్ అయ్యారు. అసలు దేవర రిలీజ్ కు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహిద్దామనుకుంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోకోల్లలుగా ఈవెంట్ ప్రదేశానికి చేరుకోవడంతో అక్కడ రచ్చ జరగడంతో ఆ ఈవెంట్ క్యాన్సిల్ అయ్యింది. 

అప్పటినుంచి దేవర ప్రమోషన్ విషయంలో ఫ్యాన్స్ డిజ్ పాయింట్ మోడ్ లో ఉన్నారు. ఇప్పుడు దేవర విడుదలైంది. విజయం సాధించడంతో అభిమానులు సక్సెస్ సెలెబ్రేషన్స్ కోసం రెడీ అయ్యారు. 10 వేలమందికి పర్మిషన్ ఇచ్చినా 30 వేలమంది హాజరయ్యేలా అభిమానులు ఆత్రుత చూపించారు. 

కానీ దసరా, దేవి నవరాత్రులు ఉత్సవాల కారణం అటు ఏపీ ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాల నుంచి అనుమతి లభించని కారణముగా దేవర ఈవెంట్ క్యాన్సిల్ చెయ్యాల్సి వచ్చింది అని అందుకే అభిమానులకు సారీ చెబుతున్నట్టుగా నాగవంశీ చేసిన ట్వీట్ చూసి ఎన్టీఆర్ అభిమానులు తెగ నిరాశపడిపోతున్నారు. 

The producer apologized to NTR fans:

Producer Naga Vamsi apologized to NTR fans
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs