నిజమే అక్కినేని ఫ్యామిలీపై, హీరోయిన్ సమంత పై తెలంగాణ మినిస్టర్ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సినిమా ఇండస్ట్రీ మొత్తం ఏకతాటిపై నిలబడింది. మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాని, అఖిల్, చైతు, సమంత, నాగార్జున, సుధీర్ బాబు, రవితేజ, తేజ సజ్జ ఇలా ప్రతి ఒక్కరు కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పుబడుతూ స్పందిస్తున్నారు.
ఇది నిజంగా జరగాలి, ఒకరికి కష్టం వస్తే ఇండస్ట్రీ మొత్తం తమ వెనుక ఉంది అనే భావన ఇలాంటి విషయాలతో తేటతెల్లమవుతుంది. కానీ గతంలో మాజీ సీఎం స్థానంలో ఉన్న నారా చంద్రబాబు భార్య భువనేశ్వరిని వైసీపీ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది రోజా, కొడాలి నాని, వల్లభనేని వంశి లాంటి వాళ్ళు అసభ్యకరమైన మాటాలన్నప్ప్పుడు వీళ్లంతా ఏమయ్యారు. ఆవిడ స్టార్ హీరో బాలయ్యకు చెల్లెలు, నటుడు ఎన్టీఆర్ కుమార్తె.
భువనేశ్వరిపై నీచమైన మాటాలన్నప్పుడు కానీ, పవన్ కళ్యాణ్ తల్లి అంజనా దేవిని రోజా, పోసాని, శ్రీరెడ్డి లాంటి వాళ్ళు చిల్లర మాటాలన్నప్పుడు కానీ సినిమా ఇండస్ట్రీ నుంచి ఏ ఒక్కరూ సపోర్ట్ గా ఒక్క ట్వీట్ కూడా వెయ్యలేదు. ఇప్పుడు నాగ్ ఫ్యామిలీ వెనుక సినిమా ఇండస్ట్రీ నిలబడడం హర్షణీయమే. కానీ వీళ్లంతా అప్పుడేమయ్యారు అంటూ అందరూ ఓపెన్ గానే మాట్లాడుతున్నారు.