పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే అంటే ఎట్లుండాలి.. ఆయనకు ప్రముఖుల బర్త్ డే విషెస్ తో పాటుగా అభిమానుల కేక్ కటింగ్స్ , బ్యానర్లు కట్టి హంగామా చెయ్యడమే కాదు.. ఆయన నటిస్తున్న సినిమాల నుంచి వచ్చే అప్ డేట్స్ తో సోషల్ మీడియా షేకవడం అన్ని జరగాలే. ప్రభాస్ బర్త్ డే మంత్ వచ్చేసింది.
అక్టోబర్ 23 ప్రభాస్ బర్త్ డే. మరి ఆయన నటిస్తున్న సినిమాల అప్ డేట్స్ మోత ఈసారి మాములుగా ఉండేలా లేదు. కారణం ప్రభాస్ నటిస్తున్న రెండు సినిమాలు సెట్స్ మీదుంటే.. మరో రెండు సినిమాలు అతి త్వరలోనే సెట్స్ మీదకి వెళ్లడానికి రెడీగా ఉన్నాయి. మరోపక్క సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ప్రభాస్ ఎప్పుడు ఓకె చెబితే అప్పుడు సందీప్ సెట్స్ లోకి వెళ్లేలా ఉన్నాడు.
ఇక ప్రస్తుతం రాజా సాబ్ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. దర్శకుడు మారుతి ప్రభాస్ బర్త్ డే కి బిగ్గెస్ట్ ట్రీట్ ని అభిమానుల కోసం రెడీ చేస్తున్నాడు. మరోపక్క హను రాఘవపూడి నుంచి ప్రభాస్ పోస్టర్ పక్కా. ఇక కల్కి 2, సలార్ 2 నుంచి ఖచ్చితంగా ప్రభాస్ బర్త్ డే కి ఆయా దర్శకులు ఏదో ఒక అప్ డేట్ సిద్ధం చెయ్యడం ఖాయం.
సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ పుట్టిన రోజుకి స్పిరిట్ నుంచి స్పెషల్ లుక్ వదిలేందుకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. సో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే అప్ డేట్స్ తో అక్టోబర్ 23 న సోషల్ మీడియా షేక్ అవ్వడం ఖాయం.