తెలంగాణ మినిస్టర్ కొండా సురేఖ అక్కినేని ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపున్నాయి. సమంత-నాగ చైతన్య విడాకుల విషయంలో కేటీఆర్ ఉన్నారంటూ సురేఖ ఇష్టం వచ్ఛినట్టుగా మాట్లాడడాన్ని సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు ఖండిస్తున్నారు. రాజకీయంగా దుమారాన్ని రేపుతున్న సురేఖ విషయంలో రంగంలోకి దిగిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్..
మంత్రి కొండా సురేఖ ను కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో మొదలైన గొడవ. ఆ సందర్భంగా కొండ సురేఖ కేటీఆర్ పై చేసిన కామెంట్స్ సందర్భంలో నాగార్జున, సమంత, నాగ చైతన్య అంశాలను ప్రస్తావించడంతో వివాదం మొదలు..
వివాదం తన దృష్టికి రావడంతో పొద్దుపోయాక కొండ సురేఖ తో స్వయంగా మాట్లాడి వివరణ ఇవ్వాల్సిందిగా సూచించిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.. పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సూచన తో మంత్రి కొండా సురేఖ రియలైజ్ అవుతూ ట్వీట్.. తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రకటించిన కొండ సురేఖ..
సమంత ట్వీట్ చూసి బాధ కలిగింది. నా వ్యాఖ్యల ఉద్దేశ్యం మహిళల పట్ల ఒక నాయకుడి ధోరణిని ప్రశ్నించడమే తప్ప మీ మనోభావాలను దెబ్బతీయడం కాదు అని.. స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాదు ఆదర్శం కూడా..
నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురనట్లయితే భేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను.. అన్యదా భవించవద్దు.. అంటూ కొండ సురేఖ ట్వీట్ చేసింది.
అప్పటికే అంటే సురేఖ ట్వీట్ చేసేసరికి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఓ వైపు తెలంగాణ ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత మొదలవడమే కాదు, సినిమా ఇండస్ట్రీ మొత్తం కొండా సురేఖ కు ఎగైనెస్ట్ గా చేస్తున్న ట్వీట్ల తో సోషల్ మీడియా మొత్తం షేకవుతుంది.