Advertisement
Google Ads BL

సినిమా ఇండస్ట్రీ అంతా ఏకతాటి పైకి..


నిన్న బుధవారం తెలంగాణ మినిస్టర్ కొండా సురేఖ నాగార్జున ఫ్యామిలీ పై చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలపై అక్కనేని అభిమానులే కాదు సినిమా ఇండస్ట్రీ ప్రముఖులంతా ఏకతాటిపైకి వచ్చి ఖండిస్తున్నారు. నాగ చైతన్య-సమంత విడిపోవడాని కారణం కేటీఆర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చెయ్యడమేగా కదు.. N కన్వెన్షన్ కూల్చకుండా ఉండేందుకు కేటీఆర్ సమంత ను తన దగ్గరకు పంపమనగా దానికి సమంత ఒప్పుకోలేదు, ఈ కారణంగానే చైతో సమంతకు విడాకులయ్యాయి అంటూ సంచలనంగా మాట్లాడింది. 

Advertisement
CJ Advs

దానితో వేంటనే నాగార్జున రియాక్ట్ అవుతూ.. గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని  గౌరవించండి. బాధ్యత గలిగిన పదవి లో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలిసిందిగా కోరుతున్నాను.. అంటూ నాగార్జున ట్వీట్ చేసారు. 

నాగ చైతన్య, అమల, ఆఖరికి సమంత కూడా తన విడాకులకు రాజకీయాలకు సంబంధం లేదు అంటూ స్పందించింది. అంతేకాదు.. సినిమా ఇండస్ట్రీ సెలబ్రిటీస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి మెగాస్టార్ చిరు వరకు సురేఖ వ్యాఖ్యలపై భగ్గుమంటూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు పెడుతున్నారు. 

మెగాస్టార్ సోషల్ మీడియా వేదికగా.. గౌరవనీయులైన మహిళా మంత్రి చేసిన అవమానకర వ్యాఖ్యలు చూసి నేను చాలా బాధపడ్డాను. 

సెలబ్రిటీలు మరియు సినీ సోదరుల సభ్యులు కష్టపడుతున్నారు. మా సభ్యులపై ఇలాంటి దుర్మార్గపు మాటల దాడులను చిత్ర పరిశ్రమగా మేము ఏకతాటిపైన వ్యతిరేకిస్తాం. 

సంబంధం లేని వ్యక్తులను, అంతకుమించి మహిళలను తమ రాజకీయ స్లగ్ ఫెస్ట్‌లోకి లాగడం మరియు అసహ్యకరమైన కల్పిత ఆరోపణలు చేయడం ద్వారా రాజకీయ పాయింట్లు సాధించినందుకు ఎవరూ ఈ స్థాయికి దిగజారకూడదు. 

సమాజంలో జీవించడానికి మంచి ప్రదేశంగా మార్చడానికి మేము మా నాయకులను ఎన్నుకుంటాము కానీ మీరు దానిని కలుషితం చేయకూడదు. రాజకీయ నాయకులు మరియు గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులు అందరికి మంచి ఉదాహరణగా ఉండాలి. 

సంబంధిత వ్యక్తులు సవరణలు చేస్తారని మరియు అసహ్యకరమైన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుంటారని ఆశిస్తున్నాను.. అంటూ చిరు ట్వీట్ చేసారు. 

కొండా సురేఖ అక్కినేని ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యలపై సినిమా ఇండస్ట్రీ అంతా ఏకతాటిపైకి వచ్చి ఖండిస్తున్నారు. 

The entire film industry is up together..:

Chiranjeevi, Jr NTR, Nani object strongly to Konda Surekha remarks on Samantha-Naga Chaitanya divorce
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs