Advertisement
Google Ads BL

Thalapathy69 స్టోరీ‌పై ఇంట్రెస్టింగ్ న్యూస్


విజయ్ లేటెస్ట్ చిత్రం GOAT గనక బ్లాక్ బస్టర్ అయితే హీరో విజయ్ ఇక నటనకు గుడ్ బై చెప్పేసి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్లాలనుకున్నాడు. కానీ GOAT చిత్రం విజయ్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. అందుకే విజయ్ మరో సినిమా చేసి హిట్టు కొట్టాకే నటన నుంచి తప్పుకోవాలని డిసైడ్ అయ్యాడు. 

Advertisement
CJ Advs

హెచ్. వినోద్ దర్శకత్వంలో విజయ్ #Thalapathy69‌ని అనౌన్స్ చేశాడు. ఈ చిత్రంలో ముందు నుంచి హీరోయిన్‌గా సమంత పేరు వినిపించినా.. తాజాగా బుట్టబొమ్మ పూజ హెగ్డే హీరోయిన్‌గా ఫైనల్ అయ్యింది. అయితే Thalapathy69 స్టోరీపై ఇప్పుడొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం సర్కిల్స్‌లో వైరల్‌గా మారింది. 

అది తెలుగులో బాలకృష్ణ-అనిల్ రావిపూడి కలయికలో తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ అయిన భగవంత్ కేసరి చిత్రాన్ని వినోద్ Thalapathy69గా రీమేక్ చేస్తున్నారని, కోలీవుడ్ ఆడియన్స్ టేస్ట్‌కి అనుగుణంగా భగవంత్ కేసరి కథను Thalapathy69గా తీర్చిదిద్దారని ప్రచారం జోరుగా మొదలైంది. పాయింట్ ఒకటే అయినప్పటికీ పోలిక రాని విధంగా ట్రీట్‌మెంట్ ఉంటుందని వినికిడి.

అందుకు అనుగుణంగానే మలయాళం నటి మమిత బైజుని విజయ్ చిత్రం కోసం తీసుకోవడం(శ్రీలీల కేరెక్టర్ కి) ఇక కాజల్ కేరెక్టర్ కోసం పూజా హెగ్డేను ఎంపిక చెయ్యడమే భగవంత్ కేసరి‌ని Thalapathy 69గా రీమేక్ చేస్తున్నారనే వార్తలకు బలం చేకూర్చాయని అంటున్నారు. మరి ఈ వార్తలు నిజమా, లేదంటే రూమర్సా అనేది కాస్త వెయిట్ చేస్తే తేలిపోతుంది.

Interesting News About Thalapathy69 Story:

Thalapathy69 is Bhagavanth Kesari Remake
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs