నార్త్ లో దేవర చిత్రం విడుదలవ్వక ముందు ఉన్న బజ్ చూస్తే ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో టెన్షన్ కనిపించింది. అందులోను దేవర కు నార్త్ లో అసలు ఓపెనింగ్స్ లేవు. ఏదో అలా అలా ప్రమోషన్స్ చేసేసి రెండు మూడు షోస్ లో పార్టిసిపేట్ చేసి దేవర ను ప్రమోట్ చేశామని అనుకున్నారు. కానీ ఆ ప్రమోషన్స్ దేవర కు సరిపోలేదు. దానితో నార్త్ ఆడియన్స్ దేవర ను రిలీజ్ డే చూడడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు.
దేవర విడుదలై సూపర్ హిట్ టాక్ వస్తే నార్త్ లో ఆపేవాడు ఉండడు అనుకుంటే దేవర కు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. దానితో దేవర మేకర్స్ నార్త్ పై ఆశలు వదులుకోవాల్సిందే అన్నారు. కానీ దేవరకు రెండోరోజు నుంచే నార్త్ లో కలెక్షన్స్ ఇంప్రూవ్ అయ్యాయి. ఫస్ట్ వీకెండ్ ముగిసి వీక్ డేస్ మొదలయ్యాక కూడా దేవర అక్కడ చెప్పుకోదగ్గ ఫిగర్స్ నమోదు చేస్తుంది.
సోమవారం 4.4 కోట్ల నెట్ వసూళ్లు అందుకుంటే మంగళవారం ఇంకాస్త ఇంప్రూవ్ అయ్యి 4.8 కోట్లు దేవర కొల్లగొట్టింది. ఈరోజు గాంధీ జయంతి హాలిడే. దేవరకు మరింతగా కలెక్షన్స్ పెరిగే అవకాశం లేకపోలేదు. మరి ఫైనల్ గా దేవర నార్త్ కలెక్షన్స్ నెంబర్ ఎంత అనేది తెలుసుకోవాలంటే కాస్త ఆగాల్సిందే.