నాగ చైతన్య-సమంత విడాకులు విషయం ముగిసిపోయిన మేటర్. ఐదేళ్ల ప్రేమను పెళ్లి బంధంగా మార్చుకున్న నాగ చైతన్య-సమంతలు నాలుగేళ్ళ వివాహా బంధాన్ని విడాకులతో ముగించేశారు. ఆ తరవాత ఎవరికి వారే తమ తమ పనిలో బిజీ అయ్యారు. నాగ చైతన్య లైఫ్ లో మూవ్ అవుతున్నాడు. రీసెంట్ గానే నటి శోభిత దూళిపాళ్లతో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు.
అయితే కొన్నాళ్లుగా సమంత-నాగ చైతన్య మద్యన గ్యాప్ వచ్చి విడాకులు అవ్వడానికి కారణం టీఆరెస్ ప్రభుత్వంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే అంటూ సన్సేషనల్ కామెంట్స్ వినిపించాయి. తాజాగా తెలంగాణ మినిస్టర్ కొండా సురేఖ మరోసారి సమంత-నాగ చైతన్య విడిపోవడానికి కారణం కేటీఆర్ అంటూ సంచలనంగా చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.
గత ప్రభుత్వంలో హీరోయిన్స్ ఫోన్ ట్యాపింగ్ చేసారు, చాలామంది హీరోయిన్స్ సినిమా ఇండస్ట్రీ నుంచి త్వరగా కనుమరుగవ్వడానికి కారణం కేటీఆర్ అంటూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారాన్ని రేపుతున్నాయి. అసలు సినిమా ఇండస్ట్రీకి డ్రగ్స్ అలవాటు చేసింది కేటీఆరే అని, కేటీఆర్ మదమెక్కి రేవ్ పార్టీలు నిర్వహించి చిత్ర పరిశ్రమను కొంతమంది బిఆరెస్ నేతలతో కలిసి బ్లాక్ మెయిల్ చేసారంటూ సురేఖ కేటీఆర్ పై విరుచుకుపడింది.