Advertisement
Google Ads BL

అధికార ప్రతినిధిగా రెచ్చిపోతున్న రోజా


వైసీపీ పార్టీలో చేరి ప్రతిపక్షంపై నోరేసుకుని పడిపోయి, జగన్ అన్నా అంటూ జగన్ భజన చేసి చివరికి మిస్టర్ అయిన రోజా కి నగరి వైసీపీ నేతలు, కార్యకర్తలతో గొడవ తో 2024 ఎన్నికల్లో ఓటమి చవి చూడాల్సి వచ్చింది. ఓటమి తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్న రోజా పక్క రాష్ట్రానికి పోతుంది. అక్కడ రాజకీయాలు చేస్తుంది అంటూ ప్రచారం జరిగింది. 

Advertisement
CJ Advs

దానితో ఇలాంటి నేతలను వదులుకోవడం ఇష్టం లేని జగన్ రోజాను వైసీపీ అధికార ప్రతినిధిగా నియమించడంతో రోజా తిరుపతి లడ్డు వ్యవహారంలో రంగంలోకి దిగింది. అధికార పక్షంపై రెచ్చిపోయి మాట్లాడుతున్న రోజా మరోమారు బీజేపీ నేత పురంధరేశ్వరి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై టార్గెట్ చేసింది. 

పవన్ ప్రాయశ్చిత్త దీక్ష తీసుకున్న సమయంలో ఇది సినిమా షూటింగ్ కాదని.. పవన్ కుటుంబ సభ్యులు గతంలో దేవుడి మీద నమ్మకం చెప్పారని కామెంట్స్ చేసిన రోజా.. టీటీడీ ఈవోను లడ్డూ విషయంలో విచారించాలని డిమాండ్ చేసింది. పురందేశ్వరి చంద్రబాబు కళ్లల్లో ఆనందం కోసమే కోర్టుల ను తప్పుబట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని, పురందేశ్వరి బీజేపీ, టీడీపీలో ఏ పార్టీకి అధ్యక్షురాలని రోజా ప్రశ్నించింది.

పవన్ కల్యాణ్ ఇది సినిమా షూటింగ్ కాదని గుర్తించాలి, విచారణ చేసి తప్పు జరిగి ఉంటే చేసిన వాళ్లను.. లేకపోతే తప్పుడు మాటలు మాట్లాడిన వారిని శిక్షించాలని, పవన్ రోజుకో వేషం, రోజుకో మాట సరికాదన్న రోజా... పవన్ చేసిన తప్పులకు భగవంతుడు ఆయనతోనే ప్రాయశ్చిత్త దీక్ష చేయిస్తున్నారని సంచలన కామెంట్స్ చేసింది రోజా. 

RK Roja Sensational Comments on Pawan Kalyan:

Roja Satirical Comments on Pawan Kalyan and Purandeswari
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs