Advertisement

రేవంత్ రెడ్డిపై ఢిల్లీ హైకమాండ్ గరం గరం..


తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ హైకమాండ్ కన్నెరజేసిందా..? ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారీ రచ్చ రచ్చ జరుగుతోందా..? ఎందుకిలా చేస్తున్నావ్ రేవంత్ అని క్లాస్ తీసుకుందా..? ఒంటెద్దు పోకడ ఇంకెన్నాళ్ళు అని గట్టిగానే జరిగిందా..? ఓ సీనియర్ నేత ప్రత్యేకంగా పిలిపించి మరీ జరిపిన మీటింగ్ హాట్ హాట్ గా నడిచిందా..? అంటే తాజాగా ఇటు రాష్ట్ర రాజకీయాల్లో.. అటు ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం మేరకు అక్షరాలా నిజమే అనిపిస్తోంది.

Advertisement

ఎందుకు.. ఏమైంది..!

ఢిల్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ హైకమాండ్ ఫైర్ అయ్యిందని వార్తలు గుప్పుంటున్నాయి. కూల్చివేతలపై తాను బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే హైదరాబాద్ మహానగరంలో హైడ్రా పేరుతో కూలుస్తావా..? అంటూ ఆగ్రహం చేసినట్టుగా తెలుస్తోంది. పార్టీ సీనియర్ల సలహాలు తీసుకోకుండా ఒంటెద్దు పోకడగా వెళ్ళడంపై గట్టిగానే మందలించినట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా.. హైడ్రా విషయంలో రాష్ట్రంలో ప్రభుత్వానికి రావల్సిన చెడ్డ పేరు వచ్చేసిందని కొందరు కాంగ్రెస్ నేతలు చెబుతున్న సంగతి తెలిసినదే. 

క్లాస్ తీసుకున్నారా..?

రేవంత్ రెడ్డిని కలిసి గైడ్ చేయాలని సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ కు.. రాహుల్ గాంధీ ఫోన్ చేసినట్టు సమాచారం. వెంటనే ఢిల్లీలో కేసీతో రేవంత్ భేటీ అయినట్టు తెలిసింది. ఐతే ఈ ఇద్దరి మధ్య వాడివేడిగా చర్చ జరిగిందట. మరోవైపు.. రేవంత్ తీరుపై ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేతలు పలువురు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. అంతేకాదు.. తమను పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని, సీనియర్లను గౌరవించడం లేదని అధిష్టానానికి మొరపెట్టుకున్నట్టు సమాచారం. తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైనట్లు కాంగ్రెస్ నేతలు వివరించారట.

మొత్తం రచ్చ..!

ముఖ్యంగా.. కేసీ వేణుగోపాల్ - రేవంత్ రెడ్డి మధ్య జరిగిన రచ్చ అంతా ఇంతా కాదట. రేవంత్.. నువ్వు చేసే పనులతో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత పెరుగుతోంది. నీ స్వలాభం కాస్త పార్టీకి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాంగ్రెస్ అంటే నీ ఒక్కడిది కాదు.. నీవు చేసే పనులతో దేశవ్యాప్తంగా ఉన్న పార్టీపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. హైకమాండ్ ఆదేశాలు భేఖాతారు చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు. ఒక్కరిద్దరు చేష్టల వలన పార్టీ పరువుపోతోంది. సీఎం అయినా.. కార్యకర్త అయిన పార్టీ పెద్దల ఆదేశాలు అనుసరిస్తూ ముందుకు పోవాలి అంటూ గట్టిగానే రేవంత్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఇందులో నిజానిజాలు ఎంత వేచి చూడాలి మరి. ఐనా.. రేవంత్ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ ఇలా ఏదో ఒకరకంగా పుకార్లు రావడం పరిపాటిగా వస్తోంది.

Delhi High Command on Revanth Reddy!!:

Telangana CM to call on Kharge in New Delhi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement