Advertisement
Google Ads BL

ఇక విజయవాడలో సినిమా జాతర


ఎక్కువగా సినిమా వాళ్ళు చాలామంది హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో దర్శనమిస్తారు. టాలీవుడ్ స్టార్స్ హైదరాబాద్ నుంచి ముంబై, చెన్నై, బెంగుళూరు వెళ్లడమే కాదు, ఫ్యామిలీస్ తో కలిసి వెకేషన్స్ అంటూ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో తెగ సందడి చేస్తూ ఉంటారు. కానీ విజయవాడ ఎయిర్ పోర్ట్ లో చాలా రేర్ గా సినిమా వాళ్లు కనిపిస్తారు. 

Advertisement
CJ Advs

ఇప్పుడు విజయవాడ ఎయిర్ పోర్ట్ లో సినిమా వాళ్ళ జాతర కనిపించబోతుంది. కారణం పవన్ కళ్యాణ్ పూర్తి చెయ్యాల్సిన సినిమాలన్నీ విజయవాడకు సమీపంలో ఉన్న అమరావతి లో స్పెషల్ సెట్స్ లో చిత్రీకరణ జరుపుకోవడానికి సిద్ధమైనాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ అమరావతిలో వేసిన స్పెషల్ సెట్స్ లో హరి హర వీరమల్లు షూటింగ్ జరుగుతుంది. 

ఆయా సినిమాల మేకర్స్ తరచూ హైదరాబాద్, ముంబై నుంచి విజయవాడ ఎయిర్ పోర్ట్ లో దిగుతూ సందడి చేస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వీరమల్లు సెట్స్ లోకి రావడానికి నిధి అగర్వాల్ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచ విజయవాడ ఎయిర్ పోర్ట్ లో దిగి అమరావతికి వెళ్ళింది. తర్వాత వీరమల్లు విలన్ బాబీ డియోల్, ఇంకా కీలక నటులు, టెక్నీకల్ సిబ్బంది, దర్శనిర్మాతలంతా హైదరాబాద్ టు విజయవాడ తరచూ ప్రయాణం చెయ్యాల్సిందే. 

ఆతర్వాత OG వంతు. పవన్ కోసం విజవాడలోనే సెట్ వేసి అది కూడా పూర్తి చేసే ఉద్దేశ్యంలో ఉంటే ఆ సినిమా నటులు, దర్శకనిర్మాతలు అందరూ విజయవాడకు పయనమవ్వాల్సిందే. సో ఇకపై విజయవాడలోనూ సినిమా జాతర మొదలు కాబోతుందన్నమాట. 

Nidhi Agarwal At Vijayawada Airport:

Nidhi Agarwal Spotted in VIjayawada Airport
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs