Advertisement
Google Ads BL

నాగార్జున ఇంత ట్విస్ట్ ఇచ్చారేమిటి


బిగ్ బాస్ సీజన్ 8 మొదలై నాలుగు వారాలు పూర్తయ్యింది. ఓపెనింగ్ డే రోజున 14మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టగా.. నాలుగు వారాలకు గాను నలుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారం బేబక్క, రెండో వారం శేఖర్ భాషా, మూడో వారం అభయ్, నాలుగో వారం తీవ్ర నెగిటివిటి తో సోనియా హౌస్ నుంచి బయటకి వచ్చారు. 

Advertisement
CJ Advs

అయితే హోస్ట్ నాగార్జున ఆడియన్స్ కు కాదు కాదు హౌస్ మేట్స్ కి బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఈ వారం నామినేషన్స్ లో ఉన్న వారిలో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతున్నట్లుగా నాగార్జున ఆదివారం ఎపిసోడ్ లో చెప్పి హౌస్ మేట్స్ కి షాక్ ఇచ్చారు. హౌస్ మేట్స్ కి డైరెక్ట్ గా చెప్పకపోయినా అది చెప్పిన రోజు షాకవ్వడం ఖాయం. 

ఇక మిడ్ వీక్ లో ఒకరు వెళితే వైల్డ్ కార్డు ఎంట్రీస్ ఎన్ని ఉంటాయో అనే ఉత్సుకత నడుస్తుంది. అదలా ఉంటే ఈ వారం ఆరుగురు నామినేషన్స్ లోకి వచ్చినట్లుగా లీకులు చెబుతున్నాయి. హౌస్ మొత్తం ఎక్కువగా నాగమణికంఠను నామినేట్ చేసిన విషయం ప్రమోస్ ద్వారా కనిపిస్తుంది. అలాగే ఆట ఆడని కారణంగా నైనిక ని కూడా చాలామంది హౌస్ మేట్స్ టార్గెట్ చేశారు. 

ఐదో వారంలో ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో ఉన్నట్లుగా తెలుస్తోంది. వారు ఆదిత్య , నబీల్, నిఖిల్, మణికంఠ, విష్ణుప్రియ, నైనిక ఈ వారం నామినేషన్స్ లో ఊదగా.. మిడ్ వీక్ లో ఎవరు బయటికివెళ్తారో అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. 

Nagarjuna gave such a twist:

Bigg Boss 8: Today nminations promo viral 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs