Advertisement

దేవుళ్లను రాజకీయాలకు దూరంగా ఉంచండి!


దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సోమవారం జరిగిన సుధీర్ఘ విచారణలో చంద్రబాబు సర్కారుపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నెయ్యి రిపోర్ట్‌పై సెకండ్‌ ఒపీనియన్‌ తీసుకున్నారా? కనీసం దేవుడినైనా రాజకీయాల నుంచి దూరంగా పెట్టండి.. నెయ్యి కల్తీ జరిగినట్లు సాక్ష్యం చూపించండి.. లడ్డూ కల్తీ జరిగిందని తేల్చడం కోసం శాంపిల్‌ ల్యాబ్‌కు పంపారా? ఇతర సప్లయర్ల నుంచి శాంపిల్స్‌ ఎందుకు తీసుకోలేదు..? అని ప్రభుత్వ తరపు లయారుపై దేశ అత్యున్నత న్యాయస్థానం కన్నెర్రజేసింది.

Advertisement

ఏంటి ఇది..!

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల శ్రీవారి సన్నిధిలోని లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారంటూ స్వయానా సీఎం చంద్రబాబు ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో.. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు.. ఇది కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన వ్యవహారం అని.. రెండో అభిప్రాయం తీసుకోకుండానే సీఎం చంద్రబాబు మీడియాతో ఎలా మాట్లాడారు..? అని ఆక్షేపించింది. 

ఒక్కటేనా..?

కేవలం ఒక్క ల్యాబ్ లోనే కాకుండా.. ఘజియాబాద్, మైసూరులలో ఉన్న ల్యాబ్లలో నెయ్యి శాంపిల్లను ఎందుకు పరీక్ష చేయించలేదు? దర్యాప్తు పూర్తి కాకుండానే కల్తీ జరిగిందని ఎలా చెబుతారు? అని సుప్రీం కోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యిని ప్రసాదంలో వాడలేదని న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా కోర్టుకు తెలిపారు. మరి.. కల్తీ జరగనప్పుడు ఎందుకు బహిరంగ ప్రకటన చేశారు? అని సుప్రీంకోర్టు ప్రశ్నించగానే లూథ్రా ఒకింత నీళ్లు నమిలారు. 

తర్వాత ఏంటి..?

TTD మాత్రం కల్తీ నెయ్యితో లడ్డూ తయారుకాలేదని చెబుతోంది. నెయ్యిని రిజెక్ట్ చేశారని మీ టీటీడీ ఈవో చెప్పారు కదా? నెయ్యి రిజెక్ట్‌ చేశాక ఇక వాడే పరిస్థితి ఉండదు కదా?. అయినా జులైలో రిపోర్ట్‌ వస్తే.. సెప్టెంబర్‌లో చెప్పారెందుకు?. సెప్టెంబర్ 18 నాటి సీఎం ప్రకటనకు ఆధారం లేదు.. దర్యాప్తు ప్రస్తుత సిట్ తో కొనసాగాలా..? లేక స్వతంత్ర దర్యాప్తు చేయించాలా..? అనేదానిపై స్పష్టత ఇస్తామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ అక్టోబరు 3కు వాయిదా వేస్తున్నట్టు సుప్రీం కోర్టుకు ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తరపు న్యాయవాది, ప్రభుత్వం ఏం చేయబోతోంది..? వాట్ నెక్స్ట్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. మరోవైపు.. సత్యమేవ జయతే అంటూ వైసీపీ పెద్ద ట్వీట్టర్ వేదికగా వైసీపీ నాయకులు, వీరాభిమానులు హడావుడి చేస్తున్నారు. టీడీపీ నుంచి .. మరీ ముఖ్యంగా.. అక్టోబరు 3న జరిగే విచారణ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఏంటో చూడాలి మరి.

Keep the gods out of politics!:

Keep Gods Out Of Politics: Supreme Court On Tirupati Laddoo Row
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement