యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర చిత్రం విడుదలకు ముందు అంటే హైదరాబాద్ లో దేవర ప్రమోషనల్ ఈవెంట్ క్యాన్సిల్ అయ్యాక నెక్స్ట్ డే నే అమెరికాలో దేవర ప్రీమియర్ కి హాజరయ్యారు. 23న భార్య ప్రణతి తో కలిసి యుఎస్ వెళ్లిన ఎన్టీఆర్ అక్కడ దేవర ప్రమోషన్స్ ముగించుకుని మళ్ళీ దేవర విడుదల రోజు అంటే ఫ్రైడే సెప్టెంబర్ 27 నే హైదరాబాద్ కి తిరిగి వస్తారు అన్నారు.
కానీ ఎన్టీఆర్ నిన్న ఆదివారం యుఎస్ నుంచి బయలుదేరి ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భార్య ప్రణతి తో సహా దిగిన విజువల్స్ సోషల్ మీడియాలో హైలెట్ అయ్యాయి. దేవర విడుదలయ్యాక సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కు దర్శకుడు కొరటాలకు థాంక్స్ చెప్పిన ఎన్టీఆర్ ఇప్పుడు దేవర పోస్ట్ ప్రమోషన్స్ అంటే దేవర సక్సెస్ సెలెబ్రేషన్స్ లాంటివి చేస్తారనుకుంటున్నారు ఫ్యాన్స్.
దేవర విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే దేవరను ప్రమోట్ చెయ్యాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ దేవర కు మిక్స్డ్ టాక్ రావడంతో దేవర ను ఇంకాస్త ప్రమోట్ చేస్తే బావుంటుంది అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి ఎన్టీఆర్ ఏమంటారో చూడాలి.