ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ నుంచి చిన్న బ్రేక్ తీసుకున్న అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి గోవాకు వెళ్ళారు. అక్కడ భార్య స్నేహ బర్త్ డే ను అల్లు అర్జున్ తన పిల్లలు, కొద్దిపాటి ఫ్రెండ్స్ మధ్యన సెలెబ్రేట్ చేసిన విషయం సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ చూస్తే తెలుస్తోంది. గత నెల రోజులుగా అల్లు అర్జున్ పుష్ప 2 సెట్స్ లో షూటింగ్ తో తలమునకై ఉన్నారు.
భార్య బర్త్ డే రోజున తన ఫ్యామిలీతో కలిసి గోవాకు వెళ్లిన అల్లు అర్జున్ అక్కడ తన పిల్లలు, భార్య తో కలిసి స్నేహ బర్త్ డే ని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసారు. ఇక అక్కడి నుంచి అంటే గోవా నుంచి మళ్ళీ హైదరాబాద్ రాగానే అల్లు అర్జున్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న పుష్ప ద రూల్ సెట్స్ కి వెళ్ళిపోతారు.
అక్టోబర్ 15 కల్లా షూటింగ్ పూర్తి చేసి ఆ తర్వాత రెండు పాటలను షూటింగ్ విదేశీ లొకేషన్స్ లో సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ 6 న పుష్ప 2 రిలీజ్ అయ్యేలా మేకర్స్ పక్కా ప్లానింగ్ తో పబ్లిసిటీ మొదలు పెట్టేసారు.