మూడు రోజులుగా బాక్సాఫీసు దగ్గర దేవర కు ఎదురు లేదనే చెప్పాలి. గత శుక్రవారం విడుదలైన దేవర చిత్రానికి ప్రేక్షకుల నుంచే కాదు.. విమర్శకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ సొంతం చేసుకున్నప్పటికి.. దేవర చిత్రానికి మొదటి వీకెండ్ బుకింగ్స్ ఫుల్ గా ఉండడంతో మూడు రోజులు దేవర బాక్సాఫీసు కలెక్షన్స్ అదిరిపోయాయి.
అయితే దేవర కు పాజిటివ్ టాక్ వస్తే వీక్ డేస్ లోను దేవర కు ఎదురుండేది కాదు. కానీ మిక్స్డ్ రెస్పాన్స్ రావడంతో దేవర కు సోమవారం నుంచి అసలు సిసలు పరీక్ష ఎదురు కానుంది. వీక్ డేస్ లో మిక్స్డ్ టాక్ మూవీస్ కి ఆడియన్స్ థియేటర్స్ కు వస్తారా.. థియేటర్ ఆక్యుపెన్సీ ఎలా ఉంటుంది అనేది మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ ఉంది.
థియేటర్ ఆక్యుపెన్సీ 60 పర్సెంట్ ఉన్నా దేవర కలెక్షన్స్ కు ఢోకా ఉండదు. ఇక నార్త్ లో మొదటిరోజు ఓపెనింగ్స్ కాస్త అటు ఇటు గా ఉన్నా రెండోరోజు నుంచి నార్త్ లో కలెక్షన్స్ పెరిగాయ్. రోజు రోజుకు నార్త్ కలెక్షన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. సో ఫైనల్ గా ఈ సోమవారం, మంగళవారం నెడితే.. బుధవారం గాంధీ జయంతి హాలిడే దేవరకు కలిసొస్తుంది.