ప్రభాస్ కల్కి రిలీజ్ అయిన సమయంలో బాలీవుడ్ నటుడు, క్రిటిక్ అయినటువంటి అర్షద్ వర్సి కల్కి చిత్రంలో ప్రభాస్ లుక్స్ పై, ప్రభాస్ కల్కిలో జోకర్ లా ఉన్నాడు అంటూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో సెగలు రేపాయి. కల్కి సినిమాలో ప్రభాస్ ఒక జోకర్ లా కనిపించాడు, ప్రభాస్ ని కల్కి లో అలా చూపించడం నచ్చలేదు లేదు అంటూ అర్షద్ ఇష్టం వచ్చినట్టుగా ప్రభాస్ పై నోరు పారేసుకున్నాడు.
అర్షద్ పై ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, టాలీవుడ్ హీరోలు కూడా ఫైర్ అయ్యారు. సోషల్ మీడియాలోనూ అర్షద్ పై ట్రోల్స్ నడిచాయి. దానితో అర్షద్ ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్ చేసుకునే పనిలో పడ్డాడు. నేను ప్రభాస్ ని జోకర్ అనలేదు అని నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం. ఆయన బ్రిలియెంట్ యాక్టర్, అలాంటి ప్రభాస్ ని కల్కి లో అలా చూపించడం నచ్చలేదు, అందుకే కల్కి సినిమాలో ప్రభాస్ చేసిన పాత్రని జోకర్ అంటూ అభివర్ణించాను అంటూ అర్షద్ మరోమారు ప్రభాస్ పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
తాజాగా ఐఫా ఉత్సవ్ లో పాల్గొన్న అర్షద్ ప్రభాస్ పై చేసిన జోకర్ కామెంట్స్ పై వివరణ ఇచ్చే ప్రయత్నం చేసాడు. మరి ప్రభాస్ ను అప్పుడు జోకర్ అంటూ మాట్లాడి ఇప్పుడు మళ్ళీ కవర్ చేసుకుంటూ అర్షద్ ప్రభాస్ కల్కి పాత్ర పై చేసిన కామెంట్స్ విషయంలో ఆయన అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.