వైసీపీ ప్రభుత్వంలో చేరి పవన్ కళ్యాణ్, చంద్రబాబు లపై ఇష్టం వచ్చినట్టుగా నోరు పారేసుకుని.. జగన్ ప్రభుత్వంలో చిన్నపాటి పదవితో సరిపెట్టుకున్నప్పటికీ.. జగన్ కు విధేయత చూపించిన నటుడు పోసాని కృష్ణమురళి 2024 ఎన్నికల్లో వైసీపీ తుడిచిపెట్టుకుపోయాక.. పోసాని కృష్ణమురళి ఇంతవరకు బయటికి రాలేదు. గత ప్రభుత్వంలో పోసాని, అలీ లు జగన్ కి భజన చేసారు.
2024 ఎన్నికల తర్వాత అలీ రాజకీయాలకు గుడ్ బై చెప్పెయ్యగా.. పోసాని మాత్రం కామ్ గానే ఉన్నాడు. అలీ పనైపోయింది. ఇక పోసాని పరిస్థితి ఏమిటో అని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీడియా స్పెషల్ ఫోకస్ పెట్టింది. కానీ పోసాని గత నాలుగు నెలలుగా ఎక్కడా, ఎవ్వరికి కనిపించలేదు.
తాజాగా తిరుపతి లడ్డు వివాదంలో పోసాని యాక్టీవ్ అయ్యాడు. చంద్రబాబు నువ్వు దేవుడికంటే అతీతుడివా.. జగన్ ని డిక్లరేషన్ ఇవ్వాలని చెబుతున్నావ్ అంటూ పవన్ కళ్యాణ్, చంద్రబాబు పై విరుచుకుపడ్డాడు. సీఎం హోదాలో ఉన్న బాబు పై పోసాని సంచలన కామెంట్స్ చేసాడు.
అది చూసిన నెటిజెన్స్.. నోటి దూల వలన నాలుగు నెలలుగా సైలెంట్ గా ఇంట్లో దూరిన పోసాని.. అధికారం పోయాక ఇప్పడు ఇన్ని నెలలకు బయటికొచ్చావా.. అంటూ వెటకారంగా కామెంట్స్ చేస్తున్నారు.