Advertisement
Google Ads BL

డిజప్పాయింట్ అవుతున్న జాన్వీ ఫ్యాన్స్


హిందీలో స్టార్ హీరోయిన్ గా మారకే సౌత్ ఎంట్రీ ఇద్దామని ఆగిన జానీ కపూర్ ను చాలామంది సౌత్ దర్శకనిర్మాతలు అప్రోచ్ అయ్యారనే వార్తలు చాలా కాలంగా సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. పూరి జగన్నాథ్ ఇలా చాలామంది దర్శకులు అడిగినా జాన్వీ కపూర్ సౌత్ ఎంట్రీకి అంత ఇష్టం చూపించలేదు. 

Advertisement
CJ Advs

ఒక్కసారిగా స్టార్ హీరో ఎన్టీఆర్ తన సినిమాలో ఆఫర్ ఇవ్వగానే ఎగిరి గంతేసి ఒప్పేసుకున్న జాన్వీ కపూర్.. పాన్ ఇండియా రేంజ్ లో సౌత్ లో గ్రాండ్ గా లాంచ్ అవుతున్నాను, గ్లోబల్ స్టేటస్ ఉన్న నటుడితో సౌత్ ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతున్నాను అని ఆశపడింది. ఆమె అభిమానులు, శ్రీదేవి అభిమానులైతే జాన్వీ కి పర్ఫెక్ట్ సౌత్ ఎంట్రీ దేవర అన్నారు. 

తీరా చూస్తే స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్స్ కి ఉండే చిన్నపాటి ఇంపార్టెన్స్ తో జాన్వీ కపూర్ దేవర 1 లో కనబడింది. అదే సినిమాకు సూపర్ హిట్ టాక్ వస్తే జాన్వీ కపూర్ ని ఆహా ఓహో అనేవారు. కానీ ఇక్కడ మిక్స్డ్ రెస్పాన్స్ రావడంతో జాన్వీ కపూర్ పాత్రపై రకరకాల కామెంట్స్ వినబడుతున్నాయి. 

దానితో జాన్వీ కపూర్ అభిమాను డిజప్పాయింట్ అవుతున్నారు. సౌత్ లో ఫస్ట్ మూవీతోనే జాన్వీ కపూర్ హైలెట్ అవుతుంది అనుకుంటే దేవర లో తంగం పాత్రలో తేల్చేసారు అంటూ వారు బాధపడిపోతున్నారు.  

Janhvi fans who are getting disappointed:

Devara: Janhvi Kapoor fans disappointed big time
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs