Advertisement
Google Ads BL

బిగ్ బాస్ 8: నాలుగో వారం సోనియా అవుట్


బిగ్ బాస్ సీజన్ 8 మొదలై నాలుగు వారాలైంది. నాలుగు వారాల్లో ఇప్పటికే హౌస్ లో ఉన్న14 మందిలో ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు. బెజవాడ బేబక్క, శేఖర్ భాషా, అభయ్ లు ఎలిమినేట్ అవ్వగా ఈ వారం నామినేషన్స్ లో ఉన్న ఆరుగురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయంలో పెద్ద సస్పెన్స్ కనిపించలేదు. కారణం ఈ వారం ఓటింగ్ లైన్స్ ఓపెన్ చేసినప్పటి నుంచి నుంచి ఒక్కరే డేంజర్ జోన్ లో ఉన్నారు. 

Advertisement
CJ Advs

ఓటింగ్స్ లైన్స్ క్లోజ్ అయ్యే వరకు ఆ ఒక్క కంటెస్టెంట్ పేరే వినిపిస్తోంది. ఆమె సోనియా. RGV హీరోయిన్ గా హౌస్ లోకి ఎంటర్ అయ్యి మొదటి వారంలో బాగానే ఉన్న ఆ అమ్మాయి సెకండ్ వీక్ నుంచి పెద్దోడు చిన్నోడు అంటూ నిఖిల్, పృథ్వీ లను తన వెంట తిప్పుకుంటూ వాళ్ళను ముందుపెట్టి ఆట ఆడడం బుల్లితెర ప్రేక్షకులకు అస్సలు నచ్చలేదు. 

హౌస్ మేట్స్ లో కూడా సోనియా.. పృథ్వీ, నిఖిల్ లను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనే మాట వినిపిస్తోంది. ప్రేరణ, యష్మి, సీత, విష్ణు ప్రియా ఇలా చాలామంది నిఖిల్ ఆటను సోనియా ఆపుతుంది అనే మాట ఇంటా బయటా వినిపించడంతో ఆమె డేంజర్ జోన్ నుంచి ఎలిమినేట్ అయ్యి నాగార్జున తో స్టేజ్ పైకి వచ్చేసిన విషయం లీకుల ద్వారా బయటికొచ్చేసింది. 

సో ఈ వారం అందరూ ఎక్స్పెక్ట్ చేసిన సోనియానే ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటికి వచ్చేసిన విషయాన్ని ఆదివారం ఎపిసోడ్లో చూడబోతున్నారు. అది చూసిన నెటిజెన్స్ హమ్మ సాయి రామ్ సోనియా బయటికి వెళ్ళిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

Bigg Boss 8: Sonia is out in the fourth week:

Bigg Boss Telugu 8: Soniya To Get Eliminated
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs