బిగ్ బాస్ హౌస్ లో నిఖిల్-సోనియా-పృథ్వీ మధ్యలో ఏం జరుగుతుందో అనేడి లోపల హౌస్ మేట్స్ కి, బయట బుల్లితెర ప్రేక్షకులకు ఓ క్లారిటీ ఉంది. ముగ్గురు కలిసి గేమ్ ఆడుతూ మిగతా వాళ్ళ విషయంలో ఎలా ఉంటున్నారో అంది మిగతా హౌస్ మేట్స్ మాత్రమే కాదు కింగ్ నాగ్ కూడా ఎప్పటికప్పుడు ఎక్స్పోజ్ చేస్తున్నారు.
ఈరోజు ఎపిసోడ్ లో నాగార్జున హౌస్ మేట్స్ కి మెత్తగా సుతిమెత్తగా ఇచ్చిపడేవారు. విష్ణు ప్రియా ను నోరు అదుపులోపెట్టుకోమని చెప్పిన నాగార్జున యష్మి నువ్వు నబీల్ లా ఆడాలనుకున్నవ్ కాని నీ ఆట ని వదిలేసి ఎవరిని చూస్తున్నావ్ అంటూ యష్మి-సోనియా నామినేషన్స్ గొడవ ఫుటేజ్ ని చూపించారు. దానికి పృథ్వీ ఏదో చెప్పబోయాడు. దీనివల్లే ఎవ్వరు ఆ క్లాన్ కు వెళ్ళలేదు అంది ప్రేరణ.
దీని వల్లే అంటే ఏమిటి అన్నారు నాగార్జున. సర్ వాళ్ళ ముగ్గురు కలిసి కూర్చోవడం, వాళ్ళే గేమ్ ఆడడడం అనింది. ఆ విషయంలో సీత కూడా అవును వాళ్ళు ఇండివిడ్యువల్ గా ఆడిన గేమ్ కనిపించడం లేదు అంది. ఆ తర్వాత నాగ్ వాళ్లకు కాస్త స్పేస్ ఇవ్వగానే సోనియా ఎప్పటిలాగే సీత పై గొడవకు దిగింది.
అన్నన్ని మాటలు ఎందుకు మాట్లాడుతున్నావ్ సీతు అంది. అంతేకాదు సోనియా సీతతో గొడవ పడిన విధానము చూసిన నాగ్ ఇలాగే మీరు ఏమి అర్ధం చేసుకోకుండా మీ ఆటను పాడుచేసుకుని, సోనియా ఆటను కూడా పాడు చెయ్యండి అంటూ నిఖిల్ కు పృథ్వీ కు నాగ్ పీకిన క్లాస్ ఈరోజు ఎపిసోడ్ లో హైలెట్ అవ్వబోతుంది.