బాలీవుడ్ లో సక్సెస్ అయ్యాకే సౌత్ లోకి రావాలనుకున్న శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ కు హిందీలో అనుకున్నంత సక్సెస్ అయితే రాలేదు. అందుకే ఇంకా బాలీవుడ్ పై నమ్మకం పెట్టుకోవడం ఎందుకు అనుకుందో.. ఎన్టీఆర్ లాంటి హీరో ఛాన్స్ ఇచ్చాడు వదులుకోకూడదు అనుకుందో అలియా భట్ దేవర ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో ఆ ప్లేసులోకి జాన్వీ కపూర్ ని ఆహ్వానించారు ఎన్టీఆర్-కొరటాల.
దేవర చిత్రంలో తంగం కేరెక్టర్ లో పరిచయమైన జాన్వీ కపూర్ కు దేవర ఎలాంటి రిజల్ట్ ఇచ్చింది, సౌత్ లో జాన్వీ కపూర్ బోణి కొట్టిందా అనే కథ సోషల్ మీడియాలో మొదలైంది. దేవర పార్ట్ 1లో జాన్వీ కపూర్ పాత్ర 20 నిమిషాల కన్నా ఎక్కువ కనిపించదు. సెకండ్ హాఫ్ లో తంగం గా చలాకీగా కనిపించిన జాన్వీ కపూర్ పాటల్లో మాత్రం అందంగా కనిపించింది.
అంతకు మించి జాన్వీ కపూర్ గురించి పార్ట్ 1లో చెప్పుకోవడానికి లేదు. జాన్వి మొదటి నుంచి చెప్పినట్టుగానే దేవర 2 లో ఆమె పాత్ర హైలెట్ అయ్యేలా కనిపిస్తుంది. దర్శకుడు హీరో ఎలివేషన్స్, యాక్షన్ మీద దృష్టి పెట్టడంతో హీరో, హీరోయిన్ మధ్యన కెమిస్ట్రీ ట్రాక్ కి ప్రాధాన్యం ఇవ్వలేదు. ఎన్టీఆర్ తో జాన్వీ ప్రేమ పండలేదు.
అటు చూస్తే దేవర కు మిక్స్డ్ టాక్ వచ్చింది. ఆడియన్స్ మాత్రమే కాదు. అన్ని భాషల క్రిటిక్స్ కూడా దేవర కు మిక్స్డ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. మరి దేవర రిజల్ట్ తో అమ్మడు పెద్దగా నిరాశ పడక్కర్లేదు. దేవర 2 వచ్చేలోపు జాన్వీ RC16 తో ఆడియన్స్ ముందుకు వచ్చేస్తుంది.