Advertisement
Google Ads BL

BB 8: సోనియా ను కాపాడితే ఇక అంతే..!


బిగ్ బాస్ సీజన్ 8 లో ఏం జరుగుతుంది. నిఖిల్-పృథ్వీ మధ్యలో సోనియా అన్నట్టుగా ట్రయాంగిల్ స్టోరీ నడుస్తుంది. అది చెబితే ఎవ్వరూ ఒప్పుకోరు. నిఖిల్ శక్తి క్లాన్ కి నిఖిల్ చీఫ్. కానీ సోనియా రూల్ చేస్తుంది. అది హౌస్ మేట్స్ మొత్తానికి నచ్చడం లేదు. వారి ఇద్దరికీ హగ్గులు ఇస్తూ, మిగతా వారితో అంటీముట్టనట్టుగా ఉండే సోనియాకి ఈవారం ఆడియన్స్ షాకివ్వాలని డిసైడ్ అయ్యారు. 

Advertisement
CJ Advs

నాలుగో వారం నామినేషన్స్ లో ఉన్న నబీల్, ప్రేరణ, నాగమణికంఠ, ఆదిత్య ఓమ్, పృథ్వీ, సోనియాలలో నబీల్ ఒక్కడికే 35 శాతం ఓట్లు నమోదు అవుతున్నాయి. నబీల్ ఆటకు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. మొదటిసారి నామినేషన్స్ లోకి వచ్చిన నబీల్ పై ప్రేమ చూపిస్తున్నారు. తర్వాత స్యానంలో ఉన్న ప్రేరరణ కు కూడా ఆడియన్స్ ఓట్లు గుద్దుతున్నారు. అటు ఇటుగా నబీల్ తో ప్రేరణ పోటీ పడుతుంది.

ఆతర్వాత స్థానంలో ఆదిత్య ఓం ఉన్నప్పటికీ ఓటింగ్ ముగిసే సమయానికి నాగమణికంఠ మూడో స్థానానికి వచ్చేసాడు. ఆతర్వాత ఆదిత్య ఓమ్ ఉన్నాడు. చివరిగా డేంజర్ జోన్ లో పృథ్వీ-సోనియాలు ఉన్నారు. సోనియాకు ఈసారి ఆడియన్స్ షాకివ్వాలని గట్టిగానే ప్రిపేర్ అయ్యారు. అయితే సోనియా వలన హౌస్ లో మసాలా పుడుతుంది. 

నిఖిల్, పృథ్వీలు ఆమెతో ఎక్కువ సమయం గడుపుతూ కంటెంట్ ఇస్తున్నారు. సో ఇలా సోనియాను బిగ్ బాస్ కాపాడే ప్రయత్నం అంటే ఆడియన్స్ ఈమెని ఎలిమినేట్ చేయాలనుకుంటే బిగ్ బాస్ సోనియాని సేవ్ చేస్తే మాత్రం ఈసారి బిగ్ బాస్ పై ఉన్న కాస్త ఇంట్రెస్ట్ కూడా ఆడియన్స్ లో తగ్గడం ఖాయమంటున్నారు నెటిజెన్స్. 

Bigg Boss 8: If you save Sonia?:

Bigg Boss 8: Sonia in danger zone
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs