Advertisement
Google Ads BL

సినిమా బాగోపోతే హీరో కటౌట్ తగలబెడతారా?


తమకి నచ్చిన హీరోలంటే అభిమానులకు ప్రాణం పెట్టేంత ఇష్టం. తమ రక్తాన్ని కూడా దారబోసేంత సరదా. హీరోల సినిమాలు విడుదలవుతున్నాయి అంటే కటౌట్ కట్టి పాలాభిషేకాలు చెయ్యడం, దండేసి దణ్ణం పెట్టడం, పూజలు నిర్వహించడం చేస్తూ ఉంటారు. స్పెయిల్ షోస్ వేసే థియేటర్స్ దగ్గర టపాసులు పేలుస్తూ హంగామా చేస్తారు.

Advertisement
CJ Advs

అంతేకాదు బ్యానెర్లు కట్టే సమయంలో ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు, ప్రీ రిలీజ్ వేడుకల దగ్గర హీరో కోసం తొక్కుకుంటారు. సినిమా విడుదలకు ముందు అంచనాలు పెట్టుకుంటారు. విడుదలయ్యాక పాజిటివ్ టాక్ వస్తే ఓకె అదే నెగెటివ్ టాక్ వస్తే మాత్రం నిరాశ పడిపోతారు. గతంలో అయితే సినిమా పొతే సైలెంట్ గా ఉండేవారు. 

కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది హీరోలపై నెగిటివిటి ఎక్కువవడం, ఒకరి సినిమా పొతే మరొకరి అభిమానులు ట్రోల్ చెయ్యడం అనేవి తరచూ చూస్తున్నాం. హీరోలు ఎలా ఉన్నా అభిమానులు అవమానంగా ఫీలైపోయి బాధపడిపోతారు. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అదే అవమానం భారంతో కనిపిస్తున్నారు. 

ప్రస్తుతం ఎన్టీఆర్ అభిమానుల పరిస్థితి అదే. ఏంతో ఆరాటంతో ఆరేళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ సోలో దర్శనం కోసం. ఆ తరుణం రానే వచ్చింది. దేవర కటౌట్స్, ఎన్టీఆర్ బ్యానర్ లు కట్టి పండగ చేసుకున్నారు. సినిమా విడుదలైంది. దేవర సోషల్ మీడియా టాక్ చూసి అభిమానులు అవమానంగా ఫీలై దేవర అందులోను ఎన్టీఆర్ కటౌట్స్ ని తగలబెట్టిన ఘటన హాట్ టాపిక్ అయ్యింది. 

దేవర కు వస్తున్న ఫీడ్ బ్యాక్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ రగిలిపోతున్నారు. కొరటాలను తిట్టిపోస్తూ ఎన్టీఆర్ కటౌట్ తగలబెట్టడం చూసి ఓరి దేవుడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏంట్రా ఇంత వైలెంట్ గా ఉన్నారంటూ కామన్ ఆడియన్స్ మాట్లాడుకుంటున్నారు. 

Jr.NTR Fans hulchul at Movie Theaters:

Fans burnt NTR cut-out in front of Devara theatre
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs