యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర విడుదలకు మరికొన్ని గంటల సమయమే ఉంది. ఎన్టీఆర్ సోలో పెరఫార్మెన్స్ చూసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. ఆరేళ్ళ తర్వాత సోలోగా ఆడియన్స్ ముందుకు వస్తున్న ఎన్టీఆర్ దేవర తో హిట్ కొట్టాలంటూ ఆయన అభిమానులు పూజలు చేస్తున్నారు. ఎన్టీఆర్ కటౌట్ కి పాలాభిషేకాలు చేస్తున్నారు.
ఇక రెండు తెలుగు రాష్ట్రాల ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆరాటం, ఆత్రుత అనేది దేవర బుకింగ్స్ లోనే తెలిసిపోతుంది. రెండు తెలుగు రాష్ట్రాలే కాదు, తమిళనాడు, కర్ణాటకలోనూ దేవర కు మంచి ఓపెనింగ్స్ రావడం అయితే పక్కానే. కానీ నార్త్ లో దేవర ఓపెనింగ్స్ విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి భయం పట్టుకుంది. అక్కడ దేవర బుకింగ్స్ మరీ డల్ గా కనబడుతున్నాయి.
దేవర విడుదలై పాజిటివ్ టాక్ వస్తే నార్త్ లో దేవర కు కలెక్షన్స్ వస్తాయి.. అదే దేవరకు టాక్ ఏ మాత్రం తేడా వచ్చినా నార్త్ లో దేవరను ఎవరూ పట్టించుకోరు. అందులోను దేవర నార్త్ ప్రమోషన్స్ విషయంలో ఆయన అభిమానులే అసంతృప్తిగా ఉన్నారు. ఎన్టీఆర్ అక్కడి ఆడియన్స్ కి కొత్తకాకపోయినా.. ఆయన బాలీవుడ్ హీరో కాదు. అందుకే ఆడియన్స్ కి వరస ప్రమోషన్స్ తో దగ్గర అవ్వాల్సి ఉంది. కానీ దేవర టీమ్ అది పట్టించులేదు.
మరి విడుదలై సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే నార్త్ లో దేవరకు తిరుగుండదు. చూద్దాం మరికాసేపట్లో దేవర నార్త్ పరిస్థితి ఏమిటి అనేది తేలిపోతుంది.