బిగ్ బాస్ హౌస్ లోకి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన సీరియల్ యాక్టర్ నిఖిల్ గత మూడు వారాలుగా వరస టాస్క్ లలో గెలుస్తూ శక్తి క్లాన్ కి చీఫ్ గా ఉంటున్నాడు. ఆటలో నిఖిల్ ని కొట్టే మరో మగ కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ లో లేడనే చెప్పాలి. కానీ సోనియా విషయంలో నిఖిల్ బిహేవియర్ ని హౌస్ మేట్స్ తీసుకోలేకపోతున్నారు
సోనియా ఆడినా ఆడకపోయినా ఆమెకి బాడీ గార్డ్ లా ఉంటున్న నిఖిల్ రెడ్ ఎగ్ ఇవ్వడంపై హౌస్ మొత్తం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక మూడో వారంలో నిఖిల్ శక్తి క్లాన్ లోకి, సీత క్లాన్ లోకి ఎవరు వెళతారు అంటే హౌస్ మొత్తం సీతకి ఓటేసింది. కేవలం సోనియా, పృథ్వీ లే నిఖిల్ క్లాన్ లోకి వెళ్లారు. బిగ్ బాస్ బలవంతంగా నాగమణికంఠ, యష్మి లను నిఖిల్ క్లాన్ లోకి పంపించాడు. కంతార క్లాన్ ఓ టాస్క్ గెలిచింది. అప్పుడు నాగమణికంఠ ను నిఖిల్ క్లాన్ నుంచి తీసేసారు.
ఇక ఈరోజు టాస్క్ లో నిఖిల్ క్లాన్ గెలిచి కాంతార క్లాన్ లో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్ నబీల్ ని నిఖిల్ తొలగించడంపై ఘర్షణ మొదలైంది. నిఖిల్ ఎప్పుడెలా ఉంటాడో తెలియదంటూ కోపంగా వెళ్ళిపోయింది విష్ణు. ఆ విషయంలో సీత, ప్రేరణ అంతా కోపంగా ఉన్నారు. ఇక శక్తి క్లాన్ లో నాగమణికంఠతో యష్మి, సోనియాలు గొడవ పడిన ప్రోమో వైరల్ గా మరింది. నిఖిల్ డెసిషన్ పై హౌస్ మొత్తం కుతకుత ఉడికిపోతుంది. వైల్డ్ కార్డ్స్ vs హౌస్ కాదు క్లాన్స్ మధ్యన గొడవ ఏమిటో అంటూ సీత మాట్లాడుతుంది. మరి ఈ గొడవ ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.