వంగవీటికి గుండెపోటు.. స్టెంట్ వేసిన డాక్టర్లు
టీడీపీ కీలక నేత వంగవీటి రాధా అస్వస్థతకు గురయ్యారు. గురువారం తెల్లారుజామున ఆయనకు స్వల్వ గుండె పోటు వచ్చింది. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వంగవీటిని పరీక్షించిన డాక్టర్లు యాంజియోగ్రామ్ చేసి స్టెంట్ వేశారు. ప్రస్తుతం డాక్టర్లు పర్యవేక్షణలో వంగవీటి రాధా ఉన్నారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు.
ఆందోళన అక్కర్లేదు!
రాధా 48 గంటల పాటు వైద్య పర్యవేక్షణలో ఉండాలని వైద్యుల సూచించారు. రాధా ఆరోగ్యం నిలకడగా ఉందని, కోలుకోవడానికి కాస్త సమయం పడుతుందని తెలిపారు. ఐతే.. వంగవీటి ఇలా జరిగిందని తెలుసుకున్న అభిమానులు, అనుచరులు, కాపు నేతలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పెద్దఎత్తున అభిమానులు రాధా ఇంటికి చేరుకొని ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. మరోవైపు ఆస్పత్రిలో కూడా అనుచరులు, టీడీపీ నేతలు పెద్ద ఎత్తున వచ్చి పరామర్శించారు. పెద్ద ప్రమాదం ఏమీ లేకపోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
జాగ్రత్త రాధా..!
రాధా ఆరోగ్యంపై సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆరా తీసినట్లు తెలిసింది. కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన బాబు, పవన్.. వంగవీటి ఆరోగ్యం ఎలా ఉంది..? డాక్టర్లు ఏం చెప్పారు..? తెల్లారుజామున ఏం జరిగింది..? ఇలా అన్నీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాధా డిశ్చార్జ్ అయ్యాక సీఎంవోకి పిలిపించుకుని చంద్రబాబు మాట్లాడుతాడని తెలిసింది.