నాగ చైతన్య తో ప్రేమలో పడి పెళ్ళికి సిద్దమైన హీరోయిన్ శోభిత దూళిపాళ్ల ఆగష్టు 8 న కుటుంబ సభ్యులు, సన్నిహితుల నడుమ నిశ్చితార్ధం చేసుకుంది. శోభిత అక్కినేని ఇంటికి కోడలిగా వెళ్లబోతుంది. అయితే శోభిత దూళిపాళ్ల నాగ చైతన్య తో ప్రేమ, పెళ్లి విషయమై కానీ, ఆమెకు జరిగిన నిశ్చితార్ధం విషయం పై కానీ ఎక్కాడా స్పందించలేదు.
నాగార్జున తన కొడుకు శోభిత తో నిశ్చితార్ధం విషయంలో చాలా హ్యాపీ గా ఉన్నాడు. సమంత తో విడాకుల సమయంలో సఫర్ అయ్యాడు అన్నారు. కానీ ఇప్పుడు హ్యాపీ గా ఉన్నాడని చెప్పారు. నాగ చైతన్య కూడా నిశ్చితార్ధం విషయం లో కానీ, శోభిత విషయం కానీ ఎక్కడా బయటపెట్టలేదు. పెళ్ళి మాత్రం అందరికి చెప్పే చేసుకుంటాను, అందుకు కుటుంబ సభ్యుల అవకాశం బట్టి పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు.
అయితే తాజాగా శోభిత చైతు తో నిశ్చితార్ధం విషయమై మొదటిసారి మాట్లాడింది. తన నిశ్చితార్ధ వేడుకలు గ్రాండ్ గా జరగాలని నేను ఎప్పుడు కలలు కనలేదు. అంతేకాదు ఇలా ఉండాలి, అలా ఉండాలనే ప్లాన్ కూడా చేసుకోలేదు. లైఫ్ లో ఆ ఇంపార్టెంట్ క్షణాలను ఆస్వాదించాలనుకున్నాను. తెలుగు సాంప్రదాయం ప్రకారం నా నిశ్చితార్ధం జరగాలి అనుకున్నాను, నా పేరెంట్స్ కూడా సాంప్రదాయాలు, సంసృతి కి ఏంతో విలువనిస్తారు.
నేను వాళ్ళ నిర్ణయానికి విలువనిస్తాను, నేను అనుకున్నట్టుగానే సన్నిహితులు, స్నేహితులు, సమక్షంలో నా నిశ్చితార్ధం ప్రశాంతంగా, సంప్రదాయబద్ధంగా జరగడంతో నేను చాలా హ్యాపీ గా ఉన్నాను. దానితో నా మనసు నిండిపోయింది. అది చాలా సింపుల్ గా జరిగింది అనుకోలేదు, నా వరకు నాకు అది పర్ఫెక్ట్ గా జరిగింది అనుకుంటున్నాను అంటూ శోభిత చైతు తో నిశ్చితార్ధం విషయంలో మొదటిసారి రియాక్ట్ అయ్యింది.