Advertisement
Google Ads BL

BB 8: డేంజర్ జోన్ లో ఆ లేడీ కంటెస్టెంట్


బిగ్ బాస్ సీజన్ 8 లో 14మందిలో కూల్ గా అందంగా అడుగుపెట్టిన సోనియా ఇప్పుడు హౌస్ లో చేసే డ్రామా మాములుగా లేదు. విష్ణు ప్రియా సరదాగా సోనియా మీకు నిఖిల్ తో స్నేహమెలా ఏర్పడింది అని అడగగానే కస్సున విష్ణు ప్రియా పై లేచింది. బయట మా గురించి తప్పుగా పోట్రె అవుతుంది, నా పేరెంట్స్ బాధపడతారు అంటూ రెచ్చిపోయిన సోనియా ఆతర్వాత చేసేది బుల్లితెర ప్రేక్షకులు చూస్తున్నారు.

Advertisement
CJ Advs

నిఖిల్, పృథ్వీ, అభయ్ లతో సోనియా ఆడుతున్న గేమ్ హౌస్ మేట్స్ లోనే కాదు బయట బుల్లితెర ప్రేక్షకుల్లోనూ సోనియా ని టార్గెట్ చేసే ఆయుధంగా మారింది. ఆమెని నామినేషన్స్ లో వేసే పాయింట్స్ కూడా నిఖిల్, పృథ్వీ లని ఆమె అడ్డుపెట్టుకుని గేమ్ ఆడుతుంది అని. అయితే అది ఆమె గేమ్ స్ట్రాటజీ అయ్యుండొచ్చు. కానీ ఆమె మొదట్లో విష్ణు ప్రియతో మాట్లాడిన మాటలకూ, ఆమె చేతలకు పొంతన లేకపోవడంతో ప్రేక్షకులు ఆమెపై నమ్మకం చూపించలేకపోతున్నారు.

అందుకే ఈ వారం నామిషన్స్ లో ఉన్న సోనియా ని సేవ్ చేసునేందుకు పెద్దగా ఎవ్వరూ ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఈ వారం నామినేషన్స్ లో ఉన్న ఆరుగురిలో ఎక్కువగా నబిల్ అధికశాతం ఓటింగ్ సాధిస్తున్నాడు, ఎంతెలా అంటే 40 శాతం ఓటింగ్ నబిల్ ఒక్కటే కొల్లగొడుతున్నాడు. మొదటి నుంచి నామినేషన్స్ లో ఉండే నాగమణికంఠ రెండో స్థానంలో ఉంటూ వస్తున్నాడు. కానీ ప్రేరణ ఈసారి రెండో స్థానాన్ని సొంతం చేసుకోగా.. ఆ తర్వాత ఆదిత్య ఓమ్, ఆ నెక్స్ట్ నాగమణికంఠ, పృథ్వీ లు ఉండగా.. చివరి డేంజర్ జోన్ లో సోనియా ఉంది.

గత రెండు రోజులుగా మొదలైన ఓటింగ్ లో సోనియా కి ఓట్లు పడడం లేదు. ఆ లెక్కన ఇదే ఓటింగ్ ఈ వారమంతా కొనసాగితే సోనియా ఎలిమినేట్ అవడం పక్కాగా కనిపిస్తుంది. చూద్దాం సోనియా నాలుగో కంటెస్టెంట్ గా బయిటకి వస్తుందో, లేదో అనేది. 

BB 8: That lady contestant in the danger zone:

No one is showing interest in saving Sonia who is in the nominations this week
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs