Advertisement
Google Ads BL

యువతి కేసుపై రియాక్ట్ అయిన హర్ష సాయి


యూట్యూబర్ హర్ష సాయి పై బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అయిన ఒక లేడీ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది. హర్ష సాయి తనని మోసం చేసాడు, తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన పేరెంట్స్ నుంచి 2 కోట్లు తీసుకుని ఇప్పుడు పెళ్ళికి నిరాకరించాడు, ఈ విషయంలో హర్ష సాయికి ఆయన తండ్రి కూడా సపోర్ట్ చేసాడు అంటూ ఆమె కంప్లైంట్ లో రాసింది.

Advertisement
CJ Advs

హర్ష సాయి నుంచి తనకు ప్రాణ హాని ఉంది, మెగా సినిమా కాపీ రైట్స్‌ కోసం హర్ష సాయి పట్టుబడుతున్నట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. మత్తుమందు ఇచ్చి తనపై అఘాయిత్యానికి పాల్పడడమే కాదు, ఆ  సమయంలో వీడియోలు తీసి.. ఆ సినిమా కాపీరైట్స్‌ ఇవ్వకపోతే వీడియోలు వైరల్‌ చేస్తానని బెదిరిస్తున్నాడని ఆమె పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్‌లో రాసింది.

తాజాగా ఈ ఇష్యు లో హర్ష సాయి పోలీసులకు దొరక్కుండా తప్పించుకున్నాడు, అంతేకాదు అతని ఫ్యామిలీ మెంబెర్స్ సైతం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ఫోన్స్ స్విఛ్ ఆఫ్ చేసినట్లుగా చెబుతున్నారు. పరారీలో ఉన్న హర్షసాయి కోసం పోలీసుల గాలింపు చేపట్టారు. అయితే హర్ష సాయి సోషల్ మీడియా వేదికగా తనపై యువతి చేసిన ఆరోపణలపై స్పందించాడు.

డబ్బు కోసమే తనపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు అంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టాడు. నా గురించి మీకు తెలుసు. త్వరలోనే నిజానిజాలు బయటకు వస్తాయి, తనపై వచ్చిన ఆరోపణలకు తన అడ్వకేట్‌ సమాధానం చెబుతాడు అంటూ హర్ష సాయి సోషల్ మీడియా లో ట్వీట్ పెట్టాడు. ప్రస్తుతం అయితే హర్ష సాయి కోసం పోలీసులు వెతుకుతున్నారు. 

Harsha Sai reacted to the case of the woman:

Harsha Sai responded to the accusations made by the young woman
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs