Advertisement
Google Ads BL

నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ


నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ జరిగింది. మోహన్ బాబు కు చెందిన జల్ పల్లి గెస్ట్ హౌస్ లో దాదాపుగా 10 లక్షల చోరీ జరగడం హాట్ టాపిక్ అయ్యింది. నాయక్ అనే వ్యక్తి మోహన్ బాబు ఫార్మ్ హౌస్ లో పని చేస్తుంటాడు. అతనే పది లక్షలు కొట్టేసినట్లుగా తెలుస్తుంది. ఈ మేరకు మోహన్ బాబు రాచకొండ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు.

Advertisement
CJ Advs

మోహన్ బాబు కంప్లైంట్ తో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా ఆ ఇంట్లో పని చేసే నాయక్ ఆ డబ్బుని కొట్టేసినట్లుగా, అతని కోసం గాలింపు చేపట్టగా నాయక్ ను తిరుపతి సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే  ఈ గెస్ట్ హౌస్ లో ఇదొక్కసారే దొంగతనం జరగలేదు, ఇంతకుముందు కూడా పలుమార్లు ఆ ఇంట్లో దొంగతనం జరిగినట్లుగా చెబుతున్నారు.  

మోహన్ బాబు ఇంట్లో దొంగతనం జరిగిన విషయంపై నెటిజెన్స్ స్పందిస్తూ మోహన్ బాబు ఇంట్లోనే చోరీ చెయ్యడానికి ఎంత ధైర్యం.. మోహన్ బాబు గనక పట్టుకుంటే నువ్వు ఈపాటికి ఎక్కడుండేవాడివో ఊహించడానికి కూడా కష్టం అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. 

Actor Mohan Babu house burglarized:

10 lakhs theft happened in Jalpalli guest house belonging to Mohan Babu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs