Advertisement

నాడు చీటికి మాటికీ సీబీఐ.. నేడు సిట్ అంతేనా!?


సీబీఐ.. సీబీఐ.. సీబీఐ.. నాడు ఏదైనా చిన్న ఇష్యూ జరిగితే చాలు సీబీఐ విచారణ జరిపించాల్సిందే.. జరిగి తీరాలంతే..! అనే డిమాండ్ ముందుగానే వచ్చేసేది. ఇలా చాలా కేసులు కేంద్ర దర్యాప్తు సంస్థల దాకా వెళ్లి పరిష్కారం కూడా అయ్యాయి. ఇంకొన్ని కొన్నేళ్లుగా నడుస్తూనే ఉన్నాయి. కానీ నేడు మాత్రం సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. ఇంతకీ నాడు ఏం జరిగింది.. నేడు ఇంకేం జరుగుతోంది..? అనేది తెలుసుకుందాం వచ్చేయండి.

Advertisement

ఇదీ అసలు సంగతి..

నాడు అంటే అదేదో దశాబ్దాల కిందట అనుకునేరు.. వైసీపీ హయాంలోనే. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 2019-2024 వరకూ రాష్ట్రంలో ఏ చిన్నపాటి ఇష్యూ జరిగినా సరే టీడీపీ, జనసేన కార్యకర్తలు మొదలుకుని నేతలు, అధినేతల వరకూ సీబీఐ విచారణ చేసి లెక్కలు తేల్చాల్సిందే అనే మాట ఆటోమాటిక్ గా వచ్చేసేది. ఇందుకు ఒకటా రెండా లెక్కలేనన్ని కేసులు ఉన్నాయ్. డాక్టర్ సుధాకర్ కేసు, కారు డ్రైవరును హత్య చేసి.. ఎమ్మెల్సీ అనంతబాబు తన కారులోనే డోర్ డెలివరీ చేయడం, వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు, వైఎస్ వివేకానంద హత్య కేసు.. ఇలా ఒకటా రెండా లెక్కలేనన్ని కేసులు విషయాల్లో సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలని టీడీపీ పదే.. పదే డిమాండ్ చేసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది కదా. కానీ.. వైసీపీకి అధికారం పోయి.. టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక సీన్ మొత్తం రివర్స్ అయ్యింది.

ఎందుకో.. ఇంకేందుకో..!

ఇప్పుడు గల్లీ నుంచి గల్ఫ్ వరకూ ఎక్కడ చూసినా నడుస్తున్నది తిరుమల లడ్డూపై చర్చ.. అంతకు మించి రచ్చ కూడా నడుస్తోంది. ఎవరినోట విన్నా వెంకన్న సన్నిధిలో ఇంత అపచారం జరిగిందా అని విచారం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన దుర్మార్గులను అస్సలు వదిలి పెట్టొద్దని కఠినంగా శిక్షించాలనే డిమాండ్ సర్వత్రా వస్తోంది. వైసీపీ అధికారంలో ఉండగా ప్రతి విషయంలోనూ సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన టీడీపీ.. ఇప్పుడు అధికారంలో ఉన్నా సరే.. వైసీపీపై విచారణ అంటే అస్సలు వద్దే వద్దు బాబోయ్ అంటూ మిన్నకుండిపోవడం గమనార్హం. అదేమిటంటే.. సీబీఐ వద్దు.. సిట్ ముద్దు అని అనుకుంటోంది టీడీపీ. నాడు సీబీఐ సీబీఐ అని గోల గోల చేసిన టీడీపీ.. నేడు అధికారంలోకి రాగానే సీబీఐ మాట కూడా టీడీపీ నోట రాకపోవడం ఎంత విచిత్రంగా ఉందో..!

ఎంత విచిత్రమో..!

వాస్తవానికి.. ఈ లడ్డూ వివాదంపై దేనికైనా సై అంటోంది వైసీపీ..! ఆఖరికి సీబీఐ విచారణకు కూడా సరే వెనక్కి తగ్గేదే లేదని ఆ పార్టీ చెబుతోంది. ఈ క్రమంలోనే దేశ ప్రధాని నరేంద్ర మోదీకి 8 పేజీల లేఖను రాసిన వైఎస్ జగన్.. రేపో మాపో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా రాయడానికి రెడీ అవుతున్నారు. అంతే కాదు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణకు కూడా ప్రతిపక్ష హోదా లేని వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఇదే మాటను ఇప్పటికే తమ నేతల ద్వారా వైసీపీ హైకమాండ్ చెప్పించింది కూడా. అధికారంలో లేని వైసీపీ ఇంతలా డిమాండ్ చేస్తుంటే.. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ నోరు మెదపకపోవడం గమనార్హం. ఎక్కడైనా అధికారంలో ఉన్న పార్టీ సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తుంది కానీ.. ఇక్కడ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీ డిమాండ్ చేస్తున్నా టీడీపీ కూటమి ఆ ఊసే ఎత్తకపోవడం ఎంత విచిత్రమో కదా..!

సిట్ చాలబ్బా..!

సీబీఐ విచారణ జరిపించాలని పెద్ద ఎత్తున డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ఆఖరికి అటు ఇటు చేసిన సీఎం చంద్రబాబు సిట్ విచారణ సరిపోతుందని.. దర్యాప్తునకు ఆదేశించారు. సిట్‌ చీఫ్‌గా సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమించడం జరిగింది. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఐతే.. నాడు చాలా విషయాలపై సీబీఐ విచారణకు డిమాండ్ చేయగా ఇప్పుడు మాత్రం ఆ మాట ఈయన నోట రాకపోవడం గమనార్హం. ఇక ప్రాయశ్చిత్త దీక్ష అంటూ 11 రోజులపాటు దీక్షలో ఉండి తిరుమలకు వెళ్ళనున్నారు. చూశారు కదా.. నాడు చీటికీ మాటికీ సీబీఐ విచారణ కోరి.. నేడు మాత్రం సిట్ చాలని సరిపెట్టుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటో సీఎం, డిప్యూటీ సీఎంలకే తెలియాలి మరి. ఈ మాట ఇద్దరి నోటా రాకపోవడంతో చిత్ర విచిత్రాలుగా జనాలు మాట్లాడుకుంటున్నారు. 

కారణం ఇదేనా!

వాస్తవానికి సీబీఐ విచారణ అంటే కొన్నేళ్ళు పాటు జరిగే ప్రక్రియ. బహుశా ఇందుకే వైసీపీ ఇంతలా డిమాండ్ చేస్తున్నా టీడీపీ కూటమి లైట్ తీసుకుంటోంది అని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. మరికొందరు సీబీఐ మీద నమ్మకం లేదేమో.. అందుకే సీబీఐ వద్దు సిట్ ముద్దని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సీబీఐ పరిధిలోకి లడ్డూ కేసును ఏం చేస్తుంది..? వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో.. వైఎస్ వివేకానంద కేసులో ఇప్పటి వరకూ తేలలేదు. ఇప్పుడు ఇదే కారణంతో చంద్రబాబు సిట్ దర్యాప్తునకు పరిమితం చేశారనే లేకపోలేదు. మున్ముందు ఇంకా ఏమేం జరుగుతుందో అని తెలుగు ప్రజల ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

No CBI.. TDP thinks SIT is Ok :

CM Chandrababu decided for SIT investigation not CBI investigation
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement