Advertisement
Google Ads BL

పవన్ తీరు పై పలు విమర్శలు


పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటూ ఈరోజు విజయవాడ కనకదుర్గ గుడిలో మీడియా ముందు మాట్లాడిన మాటలు ఇప్పుడు విమర్శలకు దారి తీశాయి. మీడియా ముందు సినిమా హీరోలు తిరుమల పవిత్ర లడ్డుపై కామెంట్స్ చెయ్యడం పై పవన్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపారన్న విషయంలో పవన్ కళ్యాణ్ రెండు రోజుల క్రితమే ప్రాయశ్చిత్త దీక్ష తీసుకున్న విషయం తెలిసిందే. 

Advertisement
CJ Advs

అదే ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా ఆయన విజయవాడ కనకదుర్గమ్మ మెట్లను శుభ్రం చేస్తూ మెట్లకు పసుపుకుంకుమతో పూజలు చేస్తూ మీడియాతో మాట్లాడారు. పందికొవ్వు ఆవు నెయ్యి కన్నా ఎక్కువ కాస్ట్లీ అంటూ పొన్నవోలు చేసిన కామెంట్స్, తనని విమర్శించిన ప్రకాష్ రాజ్ లకు వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ నిన్న హైదరాబాద్ లో జరిగిన సత్యం సుందరం మూవీ ప్రెస్ మీట్ లో హీరో కార్తీని యాంకర్ లడ్డు విషయంలో సరదాగా చేసిన కామెంట్స్ పై పవన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. 

అయితే పవన్ కళ్యాణ్ పనిగట్టుకుని ఈ వివాదంలోకి కార్తీ ని లాగడం పై పలువురు పలు విమర్శలు చేస్తున్నారు. కార్తీ సత్యం సుందరం ఈవెంట్ లో లడ్డు విషయంగా ఎలాంటి వక్ర కామెంట్స్ రాలేదు. కాని పవన్ కళ్యాణ్ మాత్రం హీరోలు తమ సినిమా ఈవెంట్స్ లో ఇలా లడ్డు విషయంలో మాట్లాడడమనేది మానుకోవాలి అన్నారు. 

అయితే అసలు ఆ ఈవెంట్ లో ఏమి లేని విషయం లో పవన్ ఇలా హీరో కార్తీ పై ఫైర్ అవడం ఏమిటో, కార్తీ విషయం లో పవన్ అంతగా రియాక్ట్ కావడం చాలామందికి అర్ధం కాని ప్రశ్నగా మిగిలిపోతే.. కార్తీ తన తప్పు లేకపోయినా పవన్ కళ్యాణ్ కి సారి చెప్పడం మాత్రం హాట్ టాపిక్ అయ్యింది. 

There are many criticisms on Pawan behavior:

Many have also criticized Pawan recent comments on Karti
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs