Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ సోలో బ్యాటింగ్


యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర తో మొదటిసారి పాన్ ఇండియా మార్కెట్ ని టచ్ చేయబోతున్నాడు. అదీ సోలో గా. ఆర్.ఆర్.ఆర్ తో ఎన్టీఆర్ పాన్ ఇండియా మార్కెట్ లోకి వెళ్ళాడు అంటే అది రాజమౌళి, రామ్ చరణ్ తో కలిసి. రాజమౌళి ప్లానింగ్, రామ్ చరణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం అన్ని అప్పుడు కలిసొచ్చాయి. కానీ ఇప్పుడు సింగిల్ గా సోలో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ మొదటిసారి పాన్ ఇండియా స్టామినా టెస్ట్ చేసుకోబోతున్నాడు.

Advertisement
CJ Advs

ఇప్పటికే ప్రభాస్ సోలోగా పాన్ ఇండియా మార్కెట్ ను దున్నేస్తున్నాడు. మరోపక్క అల్లు అర్జున్ పుష్ప 1 తో పాన్ ఇండియా మార్కెట్ లో తన స్టామినా ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు దేవర తో ఎన్టీఆర్ స్టామినా నార్త్ లో ఎంతుంది, పాన్ ఇండియా వైడ్ గా ఎన్టీఆర్ క్రేజ్ ఎంతవరకు దేవరకు కలిసొస్తుంది అనేది చూడాలి.

ప్రస్తుతం అయితే దేవర క్రేజ్ వరల్డ్ వైడ్ గా మాములుగా లేదు. ఎక్కడ చూసినా దేవర ప్రీమియర్ షోస్, బెన్ ఫిట్ షోస్ పై హైప్ మాములుగా లేవు. ఎన్టీఆర్ అభిమానులైతే ఎర్లీ మార్నింగ్ షోస్ కోసం, తెల్లవారు ఝాము 1 గంట షో కి టికెట్ రేట్ ఎంత అయినా పర్లేదు అంటూ దేవర బెన్ ఫిట్ షోస్ టికెట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు.

మరి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా దేవర మొదటి వీక్ లోనే బ్రేక్ ఈవెన్ చేరుకోవడం ఖాయం.. ఆ తర్వాత నుంచి రికార్డ్ కలెక్షన్ రావడం ఖాయమనే మాట వినిపిస్తుంది. 

NTR is touching the pan India market as a single:

Jr NTR admits feeling nervous ahead of solo release Deva
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs