యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆరేళ్ళ తర్వాత సోలోగా ఆడియన్స్ ముందుకు వస్తోన్న దేవర చిత్రంపై ఫ్యాన్స్ లో ఎంతగా అంచనాలున్నాయో.. ప్రేక్షకుల్లోనూ అంతే క్రేజ్ ఉంది. దేవర కి ఇంతకుముందు ఉన్న క్రేజ్ వేరు, ఇప్పుడున్న క్రేజ్ వేరు. ప్రమోషన్స్ విషయంలో ఎన్టీఆర్ అండ్ టీం చాలా వెనకబడిపోయింది. అయినప్పటికి దేవర ఓపెనింగ్స్ విషయంలో సెన్సేషనల్ నెంబర్లు క్రియేట్ చెయ్యడం పక్కాగా కనిపిస్తుంది.
అంతేకాదు దేవర పై అభిమానుల్లో ఏ రేంజ్ క్రేజ్ ఉంది అంటే.. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆరు వేల పాస్ లు ఇస్తే ఈవెంట్ జరిగే చోటుకు 30 వేల మంది అభిమానులు రావడం చూస్తే దేవర పై ఏ రేంజ్ హైప్ ఉందో అర్ధమవుతుంది. దేవర ఈవెంట్ కి తరలి వచ్చిన అభిమానులను చూస్తుంటే దేవర కి రికార్డ్ ఓపెనింగ్స్ రావడం ఖాయంగా కనిపిస్తుంది.
అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం దేవర విషయంలో ఫుల్ డిజ్ పాయింట్ మోడ్ లో ఉన్నారు. కారణం తెలుగులో ఎన్టీఆర్ అభిమానుల ముందుకు రాకపోవడమే. ఇక్కడ జరగాల్సిన ఈవెంట్ క్యాన్సిల్ అయ్యింది. అసలు మీడియా మీట్ కూడా ప్లాన్ చెయ్యలేదు. అప్పుడైనా ఎమన్నా ఇంట్రెస్టింగ్ విషయాలు బయటికొస్తాయేమో అని ఫ్యాన్స్ ఉంటే ఎన్టీఆర్ మాత్రం దేవర ప్రీమియర్ కోసం యుఎస్ వెళ్ళాడు.
దేవర ప్రమోషన్స్ విషయంలో అభిమానులు చాలా అసంతృప్తిగా ఉన్నారు. కొరటాల తగినంత సమయం తీసుకుని ప్రమోషన్స్ ప్లాన్ చెయ్యాలి కాని.. ఇలా చేస్తే ఎలా అని వారు మాట్లాడుకుంటున్నారు.