100 రోజుల్లో సీబీఎన్ మార్క్ పాలన..
పార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ.. నాలుగోసారి ముఖ్యమంత్రి.. ఈ సుదీర్ఘ అనుభవంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమం పరంగా నారా చంద్రబాబు నాయుడు తనదైన శైలితో దూసుకెళ్తున్నారు. వంద రోజుల పాలనలో కూటమి సర్కార్ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ ప్రజలను మాత్రం కంటికి రెప్పలా కాపాడుకుంటూ ముందుకెళ్తోంది. విజనరీ, అభివృద్ధి అంటే టక్కున గుర్తుకొచ్చే చంద్రబాబు ఈ వందరోజుల పాలనపై సామాన్యుడు మొదలుకుని సినీ, రాజకీయ పలు రంగాల ప్రముఖులు.. విశ్లేషకులు శభాష్ అని మెచ్చుకుంటున్నారు. విమర్శకులు, ప్రత్యర్థులు సైతం భేష్ అని చెబుతున్నానంటే ఇంతకు మించి ఏమీ చెప్పనక్కర్లేదు. బాబు పాలనపై.. తాజాగా ప్రముఖ నటుడు సోనూసూద్ స్పందించారు. ఓ వీడియోను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసిన ఆయన ప్రశంసల వర్షం కురిపించారు.
సుఖసంతోషాలతో..
చంద్రబాబు విశిష్ట పాలనతో తొలి వంద రోజుల్లోనే ప్రజలు సుఖసంతోషాలతో, సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకున్నారని కొనియాడారు. పాలనలో ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు తన విజన్‌తో రాష్ట్ర భవిష్యత్తు కోసం తీసుకుంటున్న చర్యలు భేష్ అని ప్రశంసించారు. ఆయన విధానాలను ప్రజలు విశ్వసిస్తున్నారని, చంద్రబాబును చూసి గర్వపడుతున్నానని తెలిపారు. ఈ 100 రోజుల పాలనతో తాము సురక్షితంగా ఉన్నామనే భావన ప్రజలకు కల్పించడంలో చంద్రబాబు విజయవంతం అయ్యారని చెప్పుకొచ్చారు. త్వరలోనే సీఎంను కలిసి రాష్ట్ర అభివృద్ధిలో తనవంతు పాత్ర పోషించాలని అనుకుంటున్నట్టు తెలిపారు.
వింటేజ్ బాబు!
పాలనలో సుదీర్ఘమై అనుభవం ఉన్న చంద్రబాబు తన విజన్‌తో రాష్ట్ర భవిష్యత్తు కోసం చర్యలు తీసుకుంటున్నారని మెచ్చుకున్నారు. రాష్ట్ర భవిష్యత్తును బాగుచేయడమే లక్ష్యంగా వింటేజ్ చంద్రబాబును గుర్తుచేసేలా పాలన ఉందని ప్రజలు భావిస్తున్నారని సోనూసూద్ చెప్పుకొచ్చారు. మంచి పాలన అందిస్తున్న చంద్రబాబుకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే మంచి ప్రభుత్వం అని పోస్టర్లు రిలీజ్ చేసిన చంద్రబాబు.. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో ప్రజలకు, రాష్ట్రానికి ఎంతో మంచి చేశామన్నారు. అంతేకాదు.. 100 రోజుల్లో జరిగిన మంచిని ఇంటింటికీ వివరిస్తున్నారు కూడా..!