పవన్ కళ్యాణ్ గత ఏడాది కాలంగా రాజకీయాల కోసం సినిమా షూటింగ్స్ ని పక్కనపెట్టేశారు. ఆయన నటిస్తున్న మూడు క్రేజీ భారీ ప్రాజెక్ట్స్ సెట్స్ మీదున్నాయి. దానితో పవన్ కళ్యాణ్ చుట్టూ ఆయా సినిమాల మేకర్స్ కాళ్ళు అరిగేలా తిరుగుతున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ను గట్టిగా ఫోర్స్ చెయ్యడానికి లేదు.
దానితో మేకర్స్ పవన్ కళ్యాణ్ కు అనుకూలంగా ఉండేలా ఆయన కోసం విజయవాడలోనే సెట్స్ వేసి మరీ తిరిగి షూటింగ్స్ కోసం ప్రిపేర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఈనెల 23 నుంచి అంటే ఈరోజు నుంచి హరి హర వీరమల్లు షూటింగ్ లో జాయిన్ అవుతానని చెప్పడంతో మేకర్స్ ధైర్యంగా వీరమల్లు రిలీజ్ డేట్ లాక్ చేసి పోస్టర్ వేసి ప్రకటించారు.
హరి హర వీరమల్లు ను మార్చ్ 28, 2025 న విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ ఈరోజు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ భరోసాతో హరి హర వీరమల్లు మేకర్స్ ధైర్యంగా విడుదల తేదీ ని లాక్ చేసేసారు. మరి పవన్ ఎలాంటి బ్రేక్ ఇవ్వకుండా వీరమల్లు షూటింగ్ కంప్లీట్ చేస్తారో లేదో చూడాలి.