Advertisement
Google Ads BL

బిగ్ బాస్ వల్ల సోనియా కు డ్యామేజ్ ?


బిగ్ బాస్ సీజన్ 8 లో పెద్దోడు నిఖిల్, చిన్నోడు పృథ్వీ ని తన వెనకాల తిప్పుకుంటూ అసలు ఆట కన్నా ఎక్కువగా ఇద్దరి మధ్యన ఆటాడుతున్న సోనియా విషయంలో బిగ్ బాస్ లో ఎంత నెగిటివిటి ఉందొ అంతకు మించి సోనియా విషయంలో బయట ట్రోల్ జరుగుతుంది. విష్ణు ప్రియా విషయంలో అరిచి గీ పెట్టిన సోనియా నేనా నీతులు చెప్పేది, నిఖిల్ ని అభయ్ ని, పృథ్వీ ని వెంట తిప్పుకుంటున్న సోనియా పై బయట నెగిటివిటి బాగా పెరిగిపోయింది.

Advertisement
CJ Advs

సోనియా ని నెటిజెన్స్ కూడా ట్రోల్ చెయ్యడంతో ఆమె పేరెంట్స్ రంగంలోకి దిగారు. మా అమ్మాయి మంచిది. ఆట కూడా బాగా ఆడుతుంది. కానీ బయట, లోపల కూడా ఆమెనే టార్గెట్ చేస్తూ బద్నామ్ చేస్తున్నారు. పల్లెటూరు నుంచి అమ్మాయి ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టి ఎంతోమందికి సహాయం చేస్తుంది. తాను సంపాదించుకున్న పేరుతొ సినిమా అవకాశాలే కాదు ఈరోజు బిగ్ బాస్ కి వెళ్లే అవకాశం వచ్చింది.

ఆమెకు లవర్స్ ఎవరూ లేరు, ఎఫ్ఫైర్స్ అంతకన్నా లేవు. ఆమెకు పెళ్లి కుదిరింది. డిసెంబర్లో పెళ్లి. ఆమె అత్తమామల ఇష్టప్రకారమే బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళింది. నిఖిల్, పృథ్వీలను పెద్దోడు, చినోడు అంటే వాళ్లిద్దరూ ఆమెకు పెద్దన్న చిన్నన్న అనుకోవచ్చు కదా. ఆమె వాళ్లతో అన్నలు అనే ఉద్దేశ్యంతోనే క్లోజ్ గా ఉంది. కానీ దానిని కూడా వక్రీకరిస్తున్నారు.

ఆమెపై హౌస్ లో ఆడవాళ్లు కూడా పగ పట్టారు. అమ్మాయి అనే ఆలోచన కూడా లేకుండా ఆమెను టార్గెట్ చేస్తున్నారు. అందుకే అన్నలుగా నిఖిల్, పృథ్వీ లు ఆమెకు  నిలబడుతున్నారు.  సోనియా బిగ్ బాస్ కప్ గెలుస్తుంది అనే నమ్మకం ఉంది. ఆమె ఐదుగురు ఆడపిల్లలను చదివిస్తుంది. ఇంకా 50 మందిని చదివించాలనుకుంటుంది, దీని వలన ఆమె పేరు పోయేలా ఉంది అంటూ సోనియా తల్లి ఆమెను వెనకేసుకొస్తుంది. 

Bigg Boss 8: Sonia - Nikhil game plan:

Sonia Akula Mother and Father Shocking Facts about Soniya BB game 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs